వీడియో వైరల్: అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో.. జనాలను పరుగులు పెట్టించిన ఆటో.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Sep 28 2021 @ 11:44AM

శివపురి(మధ్యప్రదేశ్): ఆ ప్రాంతమంతా విపరీతమైన రద్దీ నెలకొంది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో అందరూ తమ ప్రాణాలను దక్కించుకోవడం కోసం ఒక్కసారిగా పరుగులు మొదలు పెట్టారు. ఎవరికీ ఏం అర్థం కాలేదు. దీనంతటికీ కారణం.. ఓ డైవర్‌లేని ఆటోనే అని తెలిసి ముందు షాకైనా.. తర్వాత నవ్వుకున్నారు. అసలు విషయానికొస్తే..


మధ్యప్రదేశ్‌లోని శివపూరిలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డంత ఛిద్రమైంది. ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఓ భారీ గుంత కారణంగా ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా పక్కకు దూకేశాడు. ఆటోను పైకి లేపడానికి డ్రైవర్‌కు సహాయంగా కొంతమంది ముందుకొచ్చారు. కానీ ఆటో సడన్‌గా ముందుకెళ్లింది. స్థానికులు ఆపడానికి ప్రయత్నం చేసిన ఆటో ఆగలేదు. అలాగే వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఆ ప్రాంతమంతా రద్దీగా ఉండడంతో పెద్ద ప్రమాదమే జరగనున్నదని డ్రైవర్ భావించాడు. పక్కనున్న వాళ్లందరూ గట్టిగా కేకలు వేయడంతో జనాలు పక్కకు తప్పుకున్నారు.


ఆటో కొంతదూరం వెళ్లి ముందున్న వాహనాలను ఢీకొని ఆగిపోయింది. ఈ సంఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్ లేని ఆటోను చూసి ముందు కంగారుపడ్డా.. ఆ తర్వాత అందరూ నవ్వుకున్నారు. ఈ సంఘటనను వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.


దీనికి సంబంధించిన ఈ ట్విటర్ వీడియోను ఓ లుక్కేయండి:

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.