సూర్య, భువీ.. భళా

ABN , First Publish Date - 2021-07-26T09:05:07+05:30 IST

డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్‌ సెంచరీతోపాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ భువనేశ్వర్‌ (4/22) నాలుగు వికెట్లతో విజృంభించడంతో..

సూర్య, భువీ.. భళా

తొలి టీ20లో లంకపై భారత్‌ విజయం


కొలంబో:  డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్‌ సెంచరీతోపాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ భువనేశ్వర్‌ (4/22)  నాలుగు వికెట్లతో విజృంభించడంతో.. టీ20 సిరీ్‌సలోనూ గబ్బర్‌ గ్యాంగ్‌ శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరీ స్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా  38 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (35బంతుల్లో 4ఫోర్లు, ఓ సిక్స్‌తో 46) రాణించాడు. చమీర (2/24), హసరంగ (2/28) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. టీమిండియా తరఫున పృథ్వీ షా, వరుణ్‌ చక్రవర్తి పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేశారు. ఛేదనలో శ్రీలంక 18.3 ఓవర్లలో 126 పరుగులకు కుప్పకూలింది. ధాటిగా ఆడిన చరిత్‌ అసలంక (44)ను దీపక్‌ చాహర్‌ (2/24) అవుట్‌ చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. లంక ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో (26), షనక (16) ఫర్వాలేదనిపించారు. మరో ఓపెనర్‌ భనుక (10), ధనంజయ (9), బండార (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.


పృథ్వీ విఫలం..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే దెబ్బ తగిలింది.  అరంగేట్రం మ్యాచ్‌లోనే ఓపెనర్‌ పృథ్వీ షా (0).. చమీర బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే క్యాచ్‌ అవుటయ్యాడు. కెప్టెన్‌ ధవన్‌, సంజూ శాంసన్‌ (27) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్న శాంసన్‌ను హసరంగా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ దశలో ధవన్‌కు జత కలిసిన సూర్యకుమార్‌  స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కాగా, ధవన్‌ను అవుట్‌ చేసిన కరుణరత్నె.. మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. అర్ధ శతకంతో జోరుమీదున్న సూర్యను హసరంగ పెవిలియన్‌ చేర్చడంతో భారత్‌ స్కోరువేగం మందగించింది. హార్దిక్‌ పాండ్యా (10), ఇషాన్‌ కిషన్‌ (20 నాటౌట్‌), క్రునాల్‌ పాండ్యా(3నాటౌట్‌) భారీషాట్లు ఆడలేకపోయారు. 


స్కోరు బోర్డు

భారత్‌: పృథ్వీ షా (సి) భనుక (బి) చమీర 0, ధవన్‌ (సి) బండార (బి) కరుణరత్నే 46, సంజూ శాంసన్‌ (ఎల్బీ) డిసిల్వ 27, సూర్యకుమార్‌ (సి) సబ్‌/మెండిస్‌ (బి) డిసిల్వ 50, హార్దిక్‌  (సి) భనుక (బి) చమీర 10, ఇషాన్‌  (నాటౌట్‌) 20, క్రునాల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 164/5; వికెట్ల పతనం: 1-0, 2-51, 3-113, 4-127, 5-153;  బౌలింగ్‌: చమీర 4-0-24-2, కరుణరత్నె 4-0-34-1, ధనంజయ  3-0-40-0, ఉదాన 4-0-32-0, హసరంగ 4-028-2, షనక 1-0-4-0.  


శ్రీలంక: అవిష్క ఫెర్నాండో (సి) శాంసన్‌ (బి) భువనేశ్వర్‌ 26, మినోద్‌ భనుక (సి) సూర్యకుమార్‌ (బి) క్రునాల్‌ 10, ధనుంజయ డిసిల్వ (బి) చాహల్‌ 9, అసలంక (సి) షా (బి) దీపక్‌ 44, బండార (బి) హార్దిక్‌ 9, షనక (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) వరుణ్‌ 16, హసరంగ (బి) చాహర్‌ 0, కరుణరత్నె (బి) భువనేశ్వర్‌ 3, ఉదాన (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 1, చమీర (సి) క్రునాల్‌ (బి) భువనేశ్వర్‌ 1, అఖిల ధనంజయ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.3 ఓవర్లలో 126 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-23, 2-48, 3-50, 4-90, 5-111, 6-111, 7-122, 8-124, 9-125, 10-126; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.3-0-22-4, దీపక్‌ చాహర్‌ 3-0-24-2, క్రునాల్‌ 2-0-16-1, వరుణ్‌ 4-0-28-1, యజ్వేంద్ర చాహల్‌ 4-0-19-1, హార్దిక్‌ 2-0-17-1. 

Updated Date - 2021-07-26T09:05:07+05:30 IST