CJI NV Ramana : సుప్రీం ప్రొసీడింగ్స్ తొలిసారి Live Telecast.. కారణం ఏంటంటే?

ABN , First Publish Date - 2022-08-26T16:57:34+05:30 IST

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ (Justice NV Ramana) పదవీకాలం శుక్రవారం(ఆగస్టు 26)తో ముగియనుంది.

CJI NV Ramana : సుప్రీం ప్రొసీడింగ్స్ తొలిసారి Live Telecast..  కారణం ఏంటంటే?

CJI NV Ramana : భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ (Justice NV Ramana) పదవీకాలం శుక్రవారం(ఆగస్టు 26)తో ముగియనుంది. గురువారం పొద్దుపోయాక సుప్రీంకోర్టు రిజిస్ట్రీ Court Causelist ను అప్‌డేట్ చేసింది. శుక్రవారం రోజు విచారణకు రానున్న, తీర్పు వెలువరించనున్న కేసులకు సంబంధించిన జాబితాను ప్రకటించింది. కాగా.. నేడు సీజేఐ‌గా జస్టిస్‌ రమణ ఐదు కీలక కేసులుపై తీర్పులను (CJI NV Ramana to deliver verdicts in 5 high profile cases on last day) వెలువరిస్తున్నారు. విశేషం ఏంటంటే.. తొలిసారిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ‌తో కూడిన Ceremonial Bench ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 


ప్రత్యక్ష ప్రసారానికి కారణం ఏంటంటే..


ఇప్పటి వరకూ ఎందరో సీజేఐ(CJI)లు పదవీ విరమణ చేశారు. కానీ ఇప్పటి వరకూ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం(Live Telecast) చేసింది లేదు. దీనికి కారణం లేకపోలేదు. ఇలా ప్రత్యక్ష ప్రసారం ఇస్తే తమపై ఒత్తిడి(Pressure) పడుతుందని న్యాయమూర్తులు భావించడమే. దీంతో ఇప్పటి వరకూ లైవ్ ప్రొసీడింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదు. కానీ ఎన్వీ రమణ(NV Ramana) తొలి నుంచి కూడా కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ ఇవ్వాలి అని వాదించారు. ‘కోర్టులో వాదనలు లైవ్ ఇవ్వడం సాధ్యమా? కాదా?’ అనే విషయమై ఒక కమిటీ(Committee)ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సైతం లైవ్ ఇవ్వొచ్చు అని నివేదిక ఇచ్చింది. అయితే దీనిని కొందరు న్యాయమూర్తులు ఇష్టపడలేదు. కాబట్టి చివరికి తన ఫేర్ వెల్‌ను అయినా ఇలా లైవ్ ఇవ్వాలని సీజేఐ ఎన్వీ రమణ భావించారు.


Updated Date - 2022-08-26T16:57:34+05:30 IST