ఈ శుక్రవారం UAE చరిత్రలో నిలిచిపోనుంది.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-01-07T14:19:12+05:30 IST

యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఇటీవల కొత్త వీకెండ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఈ శుక్రవారం UAE చరిత్రలో నిలిచిపోనుంది.. కారణమిదే!

ఇంటర్నెట్ డెస్క్: యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఇటీవల కొత్త వీకెండ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అధికారిక పనిదినాలను కుదిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్న అరబ్ దేశం.. వారంలో కేవలం నాలుగున్నర రోజులే పని దినాలుగా నిర్ణయించింది. ఇంతకుముందు శుక్ర, శనివారాల్లో వీకెండ్‌గా ఉంటే.. ఇప్పుడు రెండున్నర రోజుల(శని, ఆదివారాలతో పాటు శుక్రవారం హాఫ్ డే) వారాంతపు సెలవుగా ప్రకటించింది. అలాగే ఈ నాలుగున్నర రోజుల్లో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త వీకెండ్ అమలులోకి వచ్చింది. దీంతో ఇప్పటి వరకు వారాంతపు సెలవుగా ఉన్న శుక్రవారం.. కొత్త వీకెండ్ కారణంగా తొలిసారి పని దినంగా మారింది. దీంతో యూఏఈలో ఈ శుక్రవారం(నేడు) తొలి పని దినంగా చరిత్రలో నిలిచిపోనుంది. 


ఇదిలాఉంటే.. పని ప్రాంతాల నుంచి దూరంగా ఉన్నవారికి, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నవారికి శుక్రవారం రోజున వర్క్ ఫ్రమ్‌హోంతో పాటు పని వేళల్లో కూడా వెసులుబాటు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం.. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు(8గంటలు) పని గంటలు. అదే శుక్రవారం రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు(నాలుగున్నర గంటలు) మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. ఏడాది పొడవునా శుక్రవారం మధ్యాహ్నం నమాజు వేళను 1.15గా నిర్ణయించారు.

Updated Date - 2022-01-07T14:19:12+05:30 IST