అంతర్వేది, ఫిబ్రవరి 27: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా నాగపౌర్ణమి సందర్భంగా శనివారం సముద్రస్నానాలు ఆచరిస్తున్న సమయంలో టేకుచేప అంతర్వేదికి చెందిన బెల్లంకొండ రాజబాబు, పెచ్చెట్టి వరలక్ష్మిలను కరిచింది. వారిని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.