మత్స్యకారుల గేలానికి వెయ్యి కిలోల టేకు చేప

ABN , First Publish Date - 2022-03-10T02:41:53+05:30 IST

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. మైలపల్లి రాముతో పాటు మరో

మత్స్యకారుల గేలానికి వెయ్యి కిలోల టేకు చేప

అచ్యుతాపురం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. మైలపల్లి రాముతో పాటు మరో నలుగురు బుధవారం ఉదయం వేటకు సముద్రంలోకి వెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక గేలాలు వేశారు. వాటికి సుమారు వెయ్యి కిలోల బరువుండే అతి భారీ టేకు చేప చిక్కింది. దానిని పడవలో ఎక్కించేందుకు విశ్వ ప్రయత్నం చేసినా..సాధ్యం కాలేదు. చివరకు ఆ చేపకు పెద్ద తాడు కట్టి పడవకు గల కొయ్యకు చుట్టి, ఒడ్డుకు చేర్చారు. అక్కడ తోటి మత్స్యకారుల సహాయంతో బయటకు లాగారు. దీనిని విక్రయిస్తే సుమారు రూ.40 వేల వరకు వస్తుందని చెబుతున్నారు.

Updated Date - 2022-03-10T02:41:53+05:30 IST