వేటకు వెళ్లొద్దు

ABN , First Publish Date - 2022-08-08T05:38:05+05:30 IST

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున నరసాపురం తీర ప్రాంతంలో మత్స్యకారులెవరూ సముద్ర వేటకు వెళ్లొద్దని ఆదివారం మత్స్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వేటకు వెళ్లొద్దు
తీరంలో నిలిచిన బోట్లు

మత్స్యశాఖ హెచ్చరికలు జారీ  

 నరసాపురం  వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున నరసాపురం  తీర ప్రాంతంలో మత్స్యకారులెవరూ సముద్ర వేటకు వెళ్లొద్దని ఆదివారం  మత్స్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం నుంచి సముద్రంలో బలమైన గాలలు వీస్తున్నట్టు సమాచారం అందింది. ఈ ప్రభావం మరో  రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందన్న వాతావారణ శాఖ హెచ్చరికతో  మత్స్య కారులకు హెచరికలు జారీ చేసినట్టు పిషరీస్‌ మండల అధికారి ఏడుకొండలు తెలిపారు. వాతావారణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో వేటకు వెళ్లిన బోట్లన్ని ఒక్కొక్కటి తీరానికి చేరుకుంటున్నాయి. మరికొన్ని అంతర్వేది వెళ్లిపోతున్నాయి.

Updated Date - 2022-08-08T05:38:05+05:30 IST