అరుదైన.. చేప చిక్కింది!

ABN , First Publish Date - 2022-06-27T06:24:40+05:30 IST

ఈ చేప పేరు చెప్పగలరా.. కాస్త కష్టమే.. ఎందుకంటే జాలర్లే చేప పేరు చెప్పలేకపోయారు.. ఇంక సాధారణం ప్రజానీకం ఏం చెప్పగలరు.

అరుదైన.. చేప చిక్కింది!
మత్స్యకారుడికి పట్టుబడిన దెయ్యం చేప

నిడదవోలు, జూన్‌ 26 : ఈ చేప పేరు చెప్పగలరా.. కాస్త కష్టమే.. ఎందుకంటే జాలర్లే చేప పేరు చెప్పలేకపోయారు.. ఇంక సాధారణం ప్రజానీకం ఏం చెప్పగలరు. అయితే దాని రూపం చూసి కొందరేమో విమానం చేప అంటుంటే మరికొందరేమో దెయ్యం చేప అంటున్నారు. నిడదవోలు మండలం తాడిమళ్ళ గ్రామ పంటబోదెలో ఆదివారం మత్స్యకారుడు  ముంగర శివకు చేపల వేటలో భాగంగా చిక్కింది. ఈ చేపను చూడగానే తోటి జాలర్లు సైతం అవాక్కయ్యారు. ఇలాంటి చేపను ఈ ప్రాంతంలో చూడ్డం మొదటిసారి అంటూ జాలర్లే పేర్కొనడం విశేషం. విచిత్రమైన విమానం చేపను చూసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. 


Updated Date - 2022-06-27T06:24:40+05:30 IST