తెల్లచేప రూ.82, ఫంగస్‌ రూ.60!

ABN , First Publish Date - 2021-07-27T06:32:04+05:30 IST

తెల్ల చేపల ధర కిలో రూ.82కు పడిపోయింది. దీంతో చేపల పెంపకం రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రూ.115 పలికిన కిలో చేప ధర ప్రస్తుతం ఒక్కసారిగా రూ.82లకు పడిపోయింది.

తెల్లచేప రూ.82, ఫంగస్‌ రూ.60!

 నష్టాల ఊబిలో చేపల రైతు

కలిదిండి, జూలై 26 : తెల్ల చేపల ధర కిలో రూ.82కు పడిపోయింది. దీంతో చేపల పెంపకం రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు రూ.115 పలికిన కిలో చేప ధర ప్రస్తుతం ఒక్కసారిగా రూ.82లకు పడిపోయింది. కరోనా నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలకు  పరిమితి సంఖ్యలో చేపల ఎగుమతులు అవుతున్నాయి. కైకలూరు నియోజకవర్గం నుంచి ప్రతిరోజు సుమారు 200 లారీల చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. ప్రస్తు తం 50 నుంచి 70 లారీలు మాత్రమే ఎగుమతి అవుతు న్నాయి. సరుకు ఎగుమతి అయ్యాక 30 రోజుల వరకు నగదు చేతిక అందటం లేదని వ్యాపారులు వాపోతు న్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పలు చేపల మార్కెట్లు మూసివేశారు. చేపల మేత (డివోబి) టన్ను రూ.13 వేలు, పచ్చితవుడు కిలో రూ.19, చెక్క కిలో రూ.40, పత్తి పిండి కిలో రూ.28, లీజు ఎకరాకు లక్ష వరకు ఉంది. ఖర్చు పెరిగి ఎగుమతులు లేక ధర పడిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సంక్షోభంలో ఫంగస్‌ చేపల సాగు
ఫంగస్‌ చేపల సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. పలు రాష్ట్రాల్లో చేపల మార్కెట్లను మూసివేయటంతో చేపల ఎగు మతులు నిలిచిపోయాయి.  ఫంగస్‌ చేపలు సాగు చేసిన రైతులు భారీగా నష్టపోతున్నారు.
లాక్‌డౌన్‌కు ముందు కిలో రూ.80 పలికిన ధర ప్రస్తుతం 60కి పడిపోయింది. కిలో ఫంగస్‌ పెరుగుదలకు రూ.70 ఖర్చు అవుతుందని, మేత భారం ఎక్కువైందని, కిలో రూ.60కి అమ్మితే తీవ్రంగా నష్టాల్లో మునిగిపోతామని చేపల రైతులు వాపోతున్నారు. ఫం గస్‌ చేపల రైతులు, ట్రేడర్లు, ఫీడ్‌ కంపెనీ యజమానులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఆక్వా అటు పోట్లపై తీవ్రస్థాయి లో చర్చించి కిలో ఫంగస్‌ ధర కనీసం రూ.65 కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.



Updated Date - 2021-07-27T06:32:04+05:30 IST