పేపర్‌ప్లేట్‌తో చేప

ABN , First Publish Date - 2021-07-12T06:19:58+05:30 IST

పేపర్‌ప్లేట్‌తో చేప

పేపర్‌ప్లేట్‌తో చేప

కావలసినవి

పేపర్‌ ప్లేట్‌ - ఒకటి, ఆరెంజ్‌ కార్డ్‌స్టాక్‌ పేపర్‌, ఆరెంజ్‌ పెయింట్‌, పెయింట్‌ బ్రష్‌, ఆరెంజ్‌ స్టిక్కర్స్‌ (గుండ్రనివి), ఆరెంజ్‌ కలర్‌ మార్కర్‌, గూగ్లీకళ్లు, జిగురు.


తయారీ విధానం

పేపర్‌ ప్లేట్‌కు ఆరెంజ్‌ కలర్‌ వేసి పూర్తిగా ఆరనివ్వాలి. 

ఆరెంజ్‌ స్టిక్కర్స్‌ను పేపర్‌ప్లేట్‌ సగభాగం వరకు అతికించాలి. ఇవి చేపల పొలుసుల్లా కనిపించేలా బొమ్మలో చూపించిన విధంగా ఒకదానిపైన ఒకటి అతికించాలి.

ఆరెంజ్‌ కార్డ్‌స్టాక్‌ పేపర్‌ను మొప్పలుగా కట్‌ చేయాలి. వాటిపైన మార్కర్‌తో గీతలు గీసి మొప్పలు నీట్‌గా కనిపించేలా చేయాలి. తరువాత జిగురుతో పేపర్‌ప్లేట్‌కు అతికించాలి. 

చివరగా గూగ్లీ కళ్లు అతికిస్తే చేప బొమ్మ రెడీ.

Updated Date - 2021-07-12T06:19:58+05:30 IST