అర్హులందరికీ మత్స్యకార భరోసా ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-29T04:47:41+05:30 IST

మంచినీళ్లపేటలో 160 మందికి అందజేయాల్సిన మత్స్యకార భరోసా సొమ్ము పక్కదారి పట్టిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. తక్షణమే ఆ సొమ్మును అర్హులైన లబ్ధి దారులకు రెండువారాల్లో అందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

అర్హులందరికీ  మత్స్యకార భరోసా ఇవ్వాలి
మత్స్యకారులతో కలిసి నిరసన తెలుపుతున్న గౌతు శిరీష

బినామీల వ్యవహారంపై విచారణ చేపట్టండి 

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష  

వజ్రపుకొత్తూరు: మంచినీళ్లపేటలో 160 మందికి అందజేయాల్సిన మత్స్యకార భరోసా సొమ్ము పక్కదారి పట్టిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. తక్షణమే ఆ సొమ్మును అర్హులైన లబ్ధి దారులకు రెండువారాల్లో అందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. శనివారం మంచినీళ్లపేటకు చెందిన 160 మంది మత్స్యకార భరోసా సొమ్ము అర్హులైన లబ్ధిదారులకు అందకపోవడంపై వారితో మాట్లాడారు. నాలుగునెలలుగా పలుసార్లు వివిధ రూపాల్లో జిల్లా అధికా రులకు వినతులు అందించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. బినామీల వ్యవహారంపై విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఆదుకోవాలని కోరినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. మత్స్యకార భరోసా సొమ్ము లబ్ధిదారులకు అందించేందుకు మంత్రి అప్పలరాజు చొరవ చూపాలని కోరారు. మరికొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, ఈ విషయంపై విచారణ చేసి అర్హులైన లబ్ధిదారులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థి ఆకుల పాపారావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బి.శశిభూషణ్‌, పి.విఠల్‌, డాక్టర్‌ దున్న కృష్ణారావు, మాజీ సర్పంచ్‌ గుల్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2020-11-29T04:47:41+05:30 IST