Viral Photo: ఈ ఫొటోలో కనిపిస్తున్నదేంటో చెప్పుకోండి చూద్దాం!

ABN , First Publish Date - 2021-12-03T02:25:03+05:30 IST

పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఫొటోలో కనిపిస్తున్న దాన్ని చీజ్ బర్గర్‌గా భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. అందరిలా మీరు కూడా దాన్ని బ

Viral Photo: ఈ ఫొటోలో కనిపిస్తున్నదేంటో చెప్పుకోండి చూద్దాం!

ఇంటర్నెట్ డెస్క్: పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఫొటోలో కనిపిస్తున్న దాన్ని చీజ్ బర్గర్‌గా భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. అందరిలా మీరు కూడా దాన్ని బర్గరే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కాగా.. ఇంతకూ అదేంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



రష్యాకు చెందిన ఓ మత్సకారుడు.. ఎప్పటిలాగే తాజాగా చేపల కోసం సముద్రంలోకి వెళ్లాడు. అనంతరం వల విసిరాడు. ఈ క్రమంలో అతడి వలకు ఓ వింత జీవి.. చిక్కింది. అచ్చం చీజ్ బర్గర్‌కు పళ్లను అమర్చినట్టు ఉండే ఆ వింత జీవిని చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత దాంతో ఫొటో దిగి.. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వింత జీవికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 




Updated Date - 2021-12-03T02:25:03+05:30 IST