చేపల చెరువుల వేలంతో 50వేల కుటుంబాలకు దెబ్బ

ABN , First Publish Date - 2021-07-27T05:05:08+05:30 IST

జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు పేరుతో చేపల చెరువుల వేలానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, దీనివల్ల దాదాపు 50వేల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయని ఎస్టీ, ఎస్సీ, బీసీ మత్స్య సహకార సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ విషయమై నెల్లూరులోని మత్స్యశాఖ కార్యాల యం ఎదుట సోమవారం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు.

చేపల చెరువుల వేలంతో 50వేల కుటుంబాలకు దెబ్బ
నిరసన తెలుపుతున్న మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు

మత్స్యశాఖ కార్యాలయం ఎదుట మత్స్య సహకార సంఘాల నిరసన

నెల్లూరు(వ్యవసాయం), జూలై 26 : జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు పేరుతో చేపల చెరువుల వేలానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, దీనివల్ల దాదాపు 50వేల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయని ఎస్టీ, ఎస్సీ, బీసీ మత్స్య సహకార సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ విషయమై నెల్లూరులోని మత్స్యశాఖ కార్యాల యం ఎదుట సోమవారం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్య సహకార సంఘాల పరిధిలోని చేపల చెరువులకు వేలం పాటలు నిర్వహించేందుకు గతేడాది జూలైలో రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చిందని, అయితే దాన్ని హైకోర్టు డిస్మిస్‌ చేసిందన్నారు. ఆ తరువాత విడుదల చేసిన జీవోను కూడా రద్దు చేసి తదుపరి విచారణను ఈ ఏడాది ఆగస్టు 11 వరకు వాయిదా వేసిందని తెలిపారు. అయితే అధికారులు 27 చెరువులకు వేలం వేసేందుకు పూనుకున్నారని, అదే జరిగితే దాదాపు 50వేల కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.  వేలం పాటలు నిర్వహించాలని నీటిపారుదలశాఖ, మత్స్యశాఖ అధికారులపై ఆఫ్‌కాఫ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చొరవ తీసుకుని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వేలం పాటలు నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మత్స్యశాఖ సూపరింటెండెంట్‌ గీతాకుమారికి వినతిపత్రం అందించారు. 

Updated Date - 2021-07-27T05:05:08+05:30 IST