మత్స్యకారుల విల...విల

ABN , First Publish Date - 2021-07-24T05:57:18+05:30 IST

జిల్లాలో వరసగా కురుస్తున్న వ ర్షాల వల్ల భారీగా మత్స్య సంపదకు నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల చెరు వులు, కుంటలు, చిన్న నీటి వనరులు నిండి పోయి ఏర్పడ్డ వరదల కార ణంగా చేపలు కొట్టుకుపోయాయి.

మత్స్యకారుల విల...విల
జగిత్యాలలో మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన చేపలు

వరదల్లో కొట్టుకుపోయిన చేపలు

ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు 

జగిత్యాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరసగా కురుస్తున్న వ ర్షాల వల్ల భారీగా మత్స్య సంపదకు నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల చెరు వులు, కుంటలు, చిన్న నీటి వనరులు నిండి పోయి ఏర్పడ్డ వరదల కార ణంగా చేపలు కొట్టుకుపోయాయి. దీంతపో మత్స్య కార్మికులు విల విల్లా డుతున్నారు. జగిత్యాల, కథలాపూర్‌, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మెట్‌ పల్లి, సారంగపూర్‌, బుగ్గారం, బీర్‌పూర్‌, రాయికల్‌ తదితర మం డలాల్లో మత్స్య సంపదకు భారీ నష్టం జరిగిందన్న అంచనా ఉంది. జిల్లాలో ఎక్కెడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందన్న వివరాలు సేకరించడం పనుల్లో మత్స్య శాఖాధికారులున్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో మత్స్య సం పద నష్టం ఎంత అన్న వివరాలు అందే వీలుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

చేపల పెంపకం పరిస్థితి ఇదీ....

జిల్లాలో 441 గ్రామ పంచాయతీ చెరువులు, 181 డిపార్ట్‌మెంట్‌ చెరు వులున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో గల 380 గ్రామ పంచాయతీల్లో గల 193 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 11, 570 మంది స భ్యులున్నారు. ఇందులో 27 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సం ఘాలలో 772 మంది మహిళా మత్స్య కార్మికులున్నారు. 166 మత్స్య పా రిశ్రామిక సహకార సంఘాలలో 10,798 మంది పురుష మత్స్య కారు లున్నారు. జిల్లాలోని మత్స్య శాఖ పరిధిలో గల 181 చెరువులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కౌలుకు ఇస్తున్నారు. దీని ద్వారా జి ల్లాలో ప్రతీ యేటా రూ. 16.56 లక్షల కౌలు సొమ్ము వస్తోంది. ఇప్పటి వరకు 173 చెరువులకు సంబంధించి రూ. 15.87 లక్షల కౌలు సొమ్ము మత్స్యశాఖ వసూలు చేసింది. జిల్లాలో ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌, గోదావరి నదిలో చేపలు పట్టుకోవడానికి 2020-21 సంవత్సరానికి గానూ 1,119 మందికి లైసెన్స్‌లు జారీ అయ్యాయి. ఇందుకు గానూ లైసెన్స్‌ ఫీజు కిం ద రూ. 3.97 లక్షలు మత్స్య శాఖకు ఆదాయం లభించింది.

చెరువుల్లో చేప పిల్లల విడుదల....

జిల్లాలోని పలు చెరువుల్లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లలు, రొయ్య పిల్లను విడుదల చేశారు. 2020-21 సంవత్సరానికి గాను జిల్లాలో 617 చెరువుల్లో వంద శాతం సబ్సీడీపై సుమారు రూ. 1.30 కోట్ల విలువ గల 138 లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా వదిలింది. వీటితో పాటు ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌లో 6.09 లక్షలు, స్తం బంపల్లిలోని కొంపల్లి చెరువలో 50 వేలు, నర్సింల పల్లి రోళ్లవాగు ప్రా జెక్టులో 1.21 లక్షల రొయ్య పిల్లలను ఉచితంగా వదిలిలారు. జిల్లాలో 2020-21 సంవత్సరానికి గానూ 7,740 టన్నుల చేపలు, 360 టన్నుల రొ య్యల ఉత్పత్తి లక్ష్యంగా మత్స్య శాఖ అధికారులు పనులు చేస్తున్నారు. 

వరుస వర్షాల వల్ల నష్టం...

వర్షాల వల్ల చేపల పెంపకం చేస్తున్న చెరువుల్లో నీరు నిండిపోయిం ది. జగిత్యాల మండలంలోని కండెపల్లి చెరువులో నుంచి భారీ సంఖ్యలో చేపలు కొట్టుకుపోయాయి. కథలాపూర్‌ మండలంలోని సిరికొండ పెద్ద చెరువు నుంచి కొట్టుకుపోతున్న చేపలు పట్టుకోవడానికి స్థానికులు ఎగ బడ్డారు. కథలాపూర్‌ మండలంలోని బొమ్మెనలో సైతం వరద నీటి ఉధృ తికి భారీ సంఖ్యలో చేపలు కొట్టుకుపోయాయి. కోరుట్ల మండలంలోని చిన్నమెట్‌పల్లి, జగిత్యాల మండలంలోని కండెపల్లి చెరువుల వద్ద మత్స్య కారులు అమర్చుకున్న ఇనుప జాలీల్లో భారీ సంఖ్యలో చేపలు చిక్కుకు న్నాయి. ఇందులో కొన్ని చనిపోగా, మరికొన్ని విక్రయించుకున్నారు. సు మారు వంద చెరువుల్లో సుమారు 25 టన్నుల చేపలు, 10 టన్నుల రొ య్యలు కొట్టుకవెళ్లడం, చనిపోవడం వల్ల మత్స్యకారులు నష్టాల పాల యినట్లు అంచనాలున్నాయి. సుమారు రూ. పాతిక లక్షల మత్స్య సంప దను నష్ట పోయినట్లు వాపోతున్నారు. 

నష్టం వివరాలు సేకరిస్తున్నాము

నర్సింహరావు, జిల్లా మత్స్య శాఖాధికారి, జగిత్యాల

జిల్లాలో వరుసగా కురిసిన వర్షాల వల్ల జరిగిన మత్స్య సంపద నష్టం పై వివరాలు సేకరిస్తున్నాము. మత్స్య కార్మికుల సొసైటీలకు నష్టం కలగ కుండా జాలీలు ఏర్పాటు చేయాలని సూచించాము. దీనివల్ల నష్టం నివా రించవచ్చును. ఇప్పటికీ కండెపల్లి చెరువులో జరిగిన చేపల నష్టం వివ రాలు వచ్చాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశాలున్నాయి. మత్స్య సంపద నష్టం వల్ల కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇచ్చే అవకాశాలు లేవు. 

మత్స్యకారులను సర్కారు ఆదుకోవాలి

- మర్రి నర్సయ్య, జిల్లా మత్స్య కార్మిక సంఘ నాయకుడు

భారీ వర్షాల వల్ల నష్టపోయిన మత్స్య కారులను ప్రభుత్వం ఆదుకో వాలి. వర్షాలు, వరదల వల్ల జిల్లాలోని పలు మండలాల్లో మత్స్య సంప దను నష్టపోయారు. ఎన్నో ఆశలతో పెంచుతున్న చేపలు కొట్టుకపోవడం వల్ల మత్స్య కార్మికులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మత్స్య కారులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి.

Updated Date - 2021-07-24T05:57:18+05:30 IST