అన్ని గ్రామాల్లో మత్స్యకార సంఘాలు

ABN , First Publish Date - 2022-06-28T06:07:53+05:30 IST

మత్స్యకారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా మత్స్యకారులను సంఘాల్లో సభ్యులుగా చేర్చడం, బీమా, రుణ సదుపాయం కల్పించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకం వారికి చేరేలా స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది.

అన్ని గ్రామాల్లో మత్స్యకార సంఘాలు
మత్స్యకారుడి నైపుణ్యాన్ని పరీక్షిస్తున్న మత్స్యశాఖ అధికారులు

కొత్తవారితో సభ్యత్వ నమోదు

అందరికీ వర్తించనున్న ప్రభుత్వ పథకాలు

చెరువులన్నీ మత్స్యశాఖ పరిధిలోకి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): మత్స్యకారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా మత్స్యకారులను సంఘాల్లో సభ్యులుగా చేర్చడం, బీమా, రుణ సదుపాయం కల్పించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకం వారికి చేరేలా స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ మత్స్యశాఖ పరిధిలోకి బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దళారుల బెడద, లీజు వ్యవహారాల్లో వివాదాలకు బ్రేక్‌ పడనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 45వేల మందికి పైగా మత్స్యకారులు ఉండగా, అదనంగా మరో 5వేల మందిని సభ్యులుగా చేర్చనున్నారు.



మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ ప థకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వ ఉచిత పథకాలు,రు ణా లు,రాయితీలు పొందాలంటే మత్స్యకార సంఘాల్లో సభ్య త్వం తప్పనిసరి చేసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 388మత్స్యకార సంఘాలు ఉన్నాయి.అందులో 342 పురుషులున్న సంఘాలు కాగా, 46 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 45,252మంది సభ్యులు ఉన్నారు.వీరు కేం ద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న పలు సంక్షేమ పథకాలు, రాయితీల ద్వారా లబ్ధిపొందుతున్నారు. కాగా,కొన్ని గ్రామా ల్లో నేటికీ మత్స్యకార సంఘాలు లేకపోవడంతో సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తామని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ప్రకటించారు.ఈ మేరకు నల్లగొండ జిల్లాలో 58 కొత్త సంఘాలు, సూర్యాపేట జిల్లాలో 18, యా దాద్రి జిల్లాలో 35, మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 111 కొత్త సంఘాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరింది.


సంఘంలో సభ్యత్వానికి పరీక్షలు

మత్స్యకార సంఘంలో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న వారికి 5రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా మత్స్యశాఖ జిల్లా అధికారి, సంఘం అధ్యక్షుడు, అనుబంధశాఖల అధికారులు ముగ్గురు సభ్యులుగా ఉంటారు. విసురు వల వేయడం, వల అల్లడం, తెప్ప కొట్టడం, పాండీగుంజడం, ఈత కొట్టడం వంటి పరీక్షలు నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికే మత్స్యకార సంఘంలో సభ్యత్వం ఇస్తారు. కమి టీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి నివేదిస్తారు. 5 రకాల పరీక్షలు నిర్వహించేప్పుడు వీడియో రికార్డింగ్‌ చేస్తారు. కాగా, సభ్యత్వం పొంది న మత్స్యకారులు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5లక్ష ల ప్రమాదబీమా వర్తిస్తుంది. అంతేగాక చెరువుల ద్వారా వ చ్చే ఆదాయంలో వాటా అందుతుంది. ప్రతి సంఘంలో కనీసంగా 11మంది, గరిష్ఠంగా 50మంది సభ్యులు ఉంటారు. నల్లగొండ జిల్లాలోని మూసీ మత్స్యకార సంఘం రాష్ట్రంలోనే పెద్దది. ఈ సంఘంలో 3,600 మంది సభ్యులుగా ఉన్నారు.


పీఎంఎ్‌సవైతో ఆర్థిక ప్రయోజనం

ఎవరైనా ఔత్సాహికులు చెరువులు ఏర్పాటు చేసుకుని చే పల పెంపకానికి ముందుకువస్తే ప్రధానమంత్రి మత్స్య సం పద యోజన(పీఎంఎ్‌సవై) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. లబ్ధిదారులు ఎంత మంది ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. రెండున్న ర ఎకరాల పరిధిలో చేపల చెరువు తవ్విన రైతుకు రూ.7లక్షల వరకు పీఎంఎ్‌సవై కింద ఆర్థిక సహాయం అందనుంది. ఈరూ.7లక్షల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళా లబ్ధిదారులకు 60శాతం సబ్సిడీ, ఓసీ, బీసీ, జనరల్‌ రైతులకు 40శాతం సబ్సిడీ లభించనుంది. గతఏడాది ఒక్క నల్లగొండ జిల్లాలో 38మంది లబ్ధిపొందగా, ఈఏడాది ఇప్పటి వరకు 86 మంది ప్రయోజనం పొందారు. నీటి వసతి ఉన్న రైతులే ఈ పథకానికి అర్హులు.


చెరువులన్నీ మత్స్యశాఖకే

పంచాయతీ పరిధిలోని చెరువుల లీజు బాధ్యత పనులను మత్స్యశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువుల్లో చేపల పెంపకం, సంఘాల ఏర్పాటు, ఎన్నికలు, లీజు బాధ్యతలను మత్స్యశాఖ చూసింది. 100 ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నా, అవి పంచాయతీ పరిధిలోనే ఉండేవి. చేపల చెరువు లీజులో అక్రమాలు చోటు చేసుకోవడం, వాటి నుంచి వచ్చే ఆదాయం పంచాయతీ ఖాతాల్లో జమ చేయకుండా గ్రామాభివృద్ధి కమిటీలు తీసుకోవడం, పలు వివాదాలు ఉండేవి. కాగా, అన్ని చెరువులను ప్రభుత్వం మత్స్యశాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో లీజుల్లో అక్రమాలు, వివాదాలకు అవకాశం లేకుండా పోయింది. అంతేగాక మొత్తం చెరువులు ఒకే గొడుగు కిందికి వచ్చాయి. ఎకరాలతో సంబంధం లేకుండా ఉమ్మడి జిల్లాలోని మొత్తం నీటి వనరులను మత్స్యశాఖకు అప్పజెప్పడంతో చేపల పెంపకం, లీజు బాధ్యతలు, ఆదాయం తదితర విషయాలన్నీ ఆ శాఖే చూడాల్సి ఉంటుంది. మత్స్యకారులున్న గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. లేదంటే గ్రామానికి చెందిన వారికి లీజుకు ఇచ్చి ఆదాయాన్ని పంచాయతీలకు చెందేలా చూడాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 4,151 చెరువులు ఉండగా, అందులో 115 చెరువులు 100ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. 4,036 చెరువులు 100ఎకరాల లోపు విస్తీర్ణంలో ఉండగా, ప్రభుత్వ నిర్ణయంతో ఇవన్నీ మత్స్యశాఖ పరిధిలోకి వచ్చాయి.

Updated Date - 2022-06-28T06:07:53+05:30 IST