డ్యాన్స్‌తో ఫిట్‌నెస్‌

ABN , First Publish Date - 2021-10-27T05:30:00+05:30 IST

లవ్‌ స్టోరీలో డ్యాన్సింగ్‌ స్టెప్పులతో అదరగొట్టేసిన నటి సాయి పల్లవికి జిమ్‌కు వెళ్లే అలవాటే లేదనే విషయం మీకు తెలుసా? ఆమె ఆరోగ్య రహస్యం డ్యాన్స్‌ ఒక్కటే! డ్యాన్స్‌తో కూడా ఫిట్‌నెస్‌ సాధ్యమేనని నిరూపించిందామె! డ్యాన్స్‌తో ఫిట్‌నెస్‌ ఎలా సాధ్యపడుతుందంటే...

డ్యాన్స్‌తో ఫిట్‌నెస్‌

లవ్‌ స్టోరీలో డ్యాన్సింగ్‌ స్టెప్పులతో అదరగొట్టేసిన నటి సాయి పల్లవికి జిమ్‌కు వెళ్లే అలవాటే లేదనే విషయం మీకు తెలుసా? 

ఆమె ఆరోగ్య రహస్యం డ్యాన్స్‌ ఒక్కటే! డ్యాన్స్‌తో కూడా ఫిట్‌నెస్‌ సాధ్యమేనని నిరూపించిందామె! డ్యాన్స్‌తో ఫిట్‌నెస్‌ ఎలా 

సాధ్యపడుతుందంటే...

ఆగకుండా అరగంట పాటు డ్యాన్స్‌ చేస్తే, 200 నుంచి 400 క్యాలరీలు ఖర్చవుతాయి. 

 ఫిట్‌నెస్‌ పెరగడంతో పాటు కండరాల కదలికలు తేలికై, బలం పుంజుకుంటాయి.

 డ్యాన్స్‌తో ఎముకలు కూడా దృఢపడతాయి.

 చర్మానికి సరిపడా రక్తప్రసరణ జరిగి ముడతలు పడే వేగం తగ్గుతుంది. చర్మం బిగుతుగా మారుతుంది. 

 గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. 

 పొట్ట, తొడలు, పిరుదులు, భుజాల్లోని కొవ్వు తేలికగా కరుగుతుంది.

 డ్యాన్స్‌కు సరిపడా శక్తి కోసం పొట్టు తొలగించని చిరుధాన్యాలు, తాజా పళ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి.

 బద్ధకం దరి చేరకుండా ఉండడం కోసం తీపి పదార్థాలు, ప్రాసె్‌సడ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. 

Updated Date - 2021-10-27T05:30:00+05:30 IST