ఈపాటి చలికే వణికిపోయి, బెంబేలెత్తిపోతున్నారా?.. ఆ ఐదు దేశాల్లోని చలి గురించి తెలుసుకుంటే గడ్డకట్టుకుపోతారేమో!

ABN , First Publish Date - 2021-12-23T12:53:46+05:30 IST

మన దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు..

ఈపాటి చలికే వణికిపోయి, బెంబేలెత్తిపోతున్నారా?.. ఆ ఐదు దేశాల్లోని చలి గురించి తెలుసుకుంటే గడ్డకట్టుకుపోతారేమో!

మన దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో జనం చలి బారి నుంచి  తప్పించుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, దుప్పట్లు, మెత్తని రగ్గులు, చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. మన దేశంలోని కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువగా నమోదవుతుంటాయి. భారీ స్థాయిలో మంచుకురుస్తుంటుంది. ప్రజలు చలికి గజగజలాడిపోతుంటారు. అయితే ప్రపంచంలోని ఆ ఐదు అత్యంత శీతల దేశాల్లో ఏడాది పొడవునా మంచు కురుస్తుంటుంది. ఆ దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


1. గ్రీన్‌ల్యాండ్

ఇది ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రం మధ్య కెనడియన్ ఆర్కిటిక్ ద్వీపసమూహానికి తూర్పున ఉంది. ఇది డెన్మార్క్ రాచరికం కింద స్వయంప్రతిపత్తి కలిగిన దేశం. అన్ని వైపులా సముద్రంతో ఉండే ఈ దేశం ప్రపంచంలోని అత్యంత శీతల దేశాలలో ఒకటి. వేసవి కాలంలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు సున్నా స్థాయికి నమోదవుతుంటాయి.


2. ఐస్‌ల్యాండ్ 

రిపబ్లిక్ ఆఫ్ ఐస్‌ల్యాండ్.. వాయువ్య ఐరోపాలో గ్రీన్ ల్యాండ్, ఫారో దీవులు, నార్వే మధ్య ఉత్తర అట్లాంటిక్‌ ప్రాతంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది ప్రపంచంలోని అత్యంత శీతల దేశాలలో ఒకటి. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌కు దిగువగా నమోదవుతుంటాయి. ఇక్కడ ఉన్న వటన్జోకుల్ గ్లేసియర్ గుహ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన గుహలలో ఒకటి.






3. కజకిస్తాన్

ఆర్కిటిక్ సర్కిల్ లోపల ఉన్న ఈ దేశం రష్యాకు దిగువన ఉంది. ఇక్కడి భూభాగం చాలా అసమానంగా ఉంటుంది, ఎత్తును బట్టి ఉష్ణోగ్రతలు మారుతుంటాయి. శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు సున్నాకి పడిపోతుంటాయి. ఈ దేశంలోని చాలా ప్రాంతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి.




4. కెనడా

ఇది ప్రపంచంలోనే అత్యంత శీతల దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి సముద్రపు నీరు గడ్డకట్టేంత చల్లగా ఉంటుంది. కెనడాలోని అన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో భారీగా మంచుకురుస్తుంటుంది.  ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి.




5. నార్వే

ఐరోపా ఖండంలోని ఈ దేశం అత్యంత శీతల ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది. 2010లో నార్వేలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 42 డిగ్రీలకు పడిపోయి రికార్డను నెలకొల్పాయి. 




Updated Date - 2021-12-23T12:53:46+05:30 IST