
ఇంఫాల్: ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను ఐదు రోజులకు కుదించింది మణిపూర్ ప్రభుత్వం. మార్చి 22న ముఖ్యమంత్రి ఎన్.బిరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని మణిపూర్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ సునంద తోక్చోమ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఒక్క వెకేషన్ డిపార్ట్మెంట్ మినహా.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఎజెన్సీలు, విభాగాలు, ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని యాజమాన్యాలు ఏప్రిల్ 1 నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి.
ఇక ఆయా కార్యాలయ సమాయాలను కూడా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపారు. దీని ప్రకారం.. ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేస్తాయి. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇది వర్తించనుంది. ఇక శీతాకాలమైన నవంబర్-ఫిబ్రవరిలల్లో అరగంట తగ్గించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయాలు తెరిచి ఉంటాయట.
ఇవి కూడా చదవండి