
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా పట్టణంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా వస్తున్న ట్రాక్టరు ట్రాలీ ప్రమాదవశాత్తూ బోల్తాపడిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన ఛనేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనోరా గ్రామ సమీపంలో జరిగింది. ఈ విషాద ఘటన జరిగినప్పుడు ట్రాక్టర్ ట్రాలీలో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు.ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ట్రాక్టర్ ట్రాలీపై ప్రార్థనలు చేసేందుకు మేధపాని గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగిందని ఖాండ్వా ఎస్పీ వివేక్ సింగ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి