Advertisement

ఐదు దుకాణాలు, హోటల్‌లో దొంగతనం

Feb 28 2021 @ 00:20AM

దోమ: దోమలో శుక్రవారం రాత్రి ఐదు దుకాణాలు, ఒక హోటల్‌లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఇ.అనసూయ, యాదయ్యగౌడ్‌, కన్నయ్య, రాములు, వెంకటయ్య, బిచ్చయ్య అనే వ్యక్తుల షాపులు, హోటల్‌లో రూ.7వేలు, 4తులాల వెండి ఎత్తుకపోయారు. ఈ చోరీలకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం లేదని స్థానికులంటున్నారు. మండల కేంద్రంలోనే దొంగతనాలు ఇంతగా జరుగుతోంటే పోలీసులేం చేస్తున్నారని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on:
Advertisement