Good News: 5,000వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-10-07T15:01:54+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న..

Good News: 5,000వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టులు


బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.


ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 248

తెలంగాణలో ఖాళీలు: 205


దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ బోర్డ్‌(ఐబీపీఎస్‌).. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసె్‌స(సీఆర్‌పీ)నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న సుమారు 5,000వేలకు పైగా ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేస్తారు.


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 2021 జూలై 01 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్స్‌ ఆధారంగా



ప్రిలిమినరీ పరీక్ష విధానం: ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌టై్‌పలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30 ప్రశ్నలు, న్యుమరికల్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు ఇస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఆమల్లో ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు కట్‌ చేస్తారు.


మెయిన్‌ ఎగ్జామ్‌: దీనిని  కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. పరీక్ష సమయం 160 నిమిషాలు. మొత్తం మార్కులు 200. ప్రశ్న పత్రం ఆబ్జెటివ్‌ టైప్‌లోనే ఉంటుంది. మొత్తం 190 ప్రశ్నలు వస్తాయి. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు(50 మార్కులు), జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి 40 ప్రశ్నలు(40 మార్కు లు), రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 50 ప్రశ్నలు (60 మార్కులు), క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 50 ప్రశ్నలు(50 మార్కులు) వస్తాయి. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఆమల్లో ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్కు కట్‌ చేస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 27

ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 2021      

మెయిన్‌ పరీక్ష: జనవరి/ఫిబ్రవరి 2022

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: ఏప్రిల్‌ 2022

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

నోట్‌: జూలైలో దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ అప్లయ్‌ చేయనవసరం లేదు.

Updated Date - 2021-10-07T15:01:54+05:30 IST