పద్మశాలి సంఘంలో జెండా వివాదం

ABN , First Publish Date - 2022-01-27T06:14:32+05:30 IST

జిల్లా పద్మశాలి సంఘం నేతల మధ్య జెండా వివాదం రేపింది. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఎగురవేసేందుకు ఓ వర్గం సిద్ధం కాగా, మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో

పద్మశాలి సంఘంలో జెండా వివాదం

పట్టణంలో భారీగా పోలీసు బలగాల మోహరింపు
ఆదిలాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): జిల్లా పద్మశాలి సంఘం నేతల మధ్య జెండా వివాదం రేపింది. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఎగురవేసేందుకు ఓ వర్గం సిద్ధం కాగా, మరో వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ అధికారుల సహకారంతో పోలీసులు జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో తాలుకా సంఘ భవన కార్యాలయాన్ని సీజ్‌ చేయడం వివాదస్పదంగా మారింది. ఓ వర్గానికి అధికార పార్టీ మద్దతు తెలుపగా, మరో వర్గానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతుగా నిలిచాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ముందస్తుగా సంఘ భవనంతో పాటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.  ఈ విషయమై ఆర్డీవో జాడి రాజేశ్వర్‌ను వివరణ కోరగా పోలీసుల ఫిర్యాదు మేరకే సంఘ భవనాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-01-27T06:14:32+05:30 IST