పుష్పగిరిలో ధ్వజారోహణం

ABN , First Publish Date - 2021-05-11T04:50:33+05:30 IST

ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి క్షేత్రంలో శ్రీకామాక్షి సమేత వైద్యనాధేశ్వర శ్రీలక్ష్మి చెన్నకేశవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ధ్వజారోహణాన్ని నిర్వహించారు.

పుష్పగిరిలో ధ్వజారోహణం
పూజలు చేస్తున్న అర్చకులు

తిరుచ్చి వాహనంపై హరిహరాదులు


వల్లూరు, మే 10: ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి క్షేత్రంలో శ్రీకామాక్షి సమేత వైద్యనాధేశ్వర శ్రీలక్ష్మి చెన్నకేశవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ధ్వజారోహణాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఉదయాన్నే గణపతిపూజ, పుణ్యహవచనం చేశారు. పూజలు, హోమాదులు, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై దిగువన, కొండపై హరిహరాదులను సుందరంగా అలంకరించి పీఠంపై ఆశీనులను చేశారు. కొవిడ్‌ నేపధ్యంలో కేవలం నియమ నిబంధనల మేరకే భక్తులకు అనుమతి లేకుండా కేవలం అర్చకులు మాత్రమే ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం గరుడ చిత్రపటాన్ని సుందరంగా అలంకరించి ధ్వజారోహణం చేసి దేవతలను బ్రహ్మోత్సవాలకు రమ్మని ఆహ్వానం పలికారు. దిగువన వైద్యనాధేశ్వర ఆలయంలో కూడా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు భక్తులు ఎవరూ రావద్దని ఆలయ నిర్వాహకులు కోరారు.

Updated Date - 2021-05-11T04:50:33+05:30 IST