మంటగలుస్తున్న మానవత్వం

ABN , First Publish Date - 2020-09-06T09:38:14+05:30 IST

మానవత్వం మంటగలుస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలను చూసైనా తోటివారి మనసు కరగడం లేదు...

మంటగలుస్తున్న మానవత్వం

కరోనా వైరస్‌ బాధితులపై తోటి వారి చిన్నచూపు

బాన్సువాడలో మృతదేహం వద్దకు రాని బంధువులు

కామారెడ్డిలో వైరస్‌ అనుమానంతో వృద్ధుడి మృతదేహాన్ని అనుమతించని అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు

కుటుంబ సభ్యులను సైతం అనుమతించని దుస్థితి

అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులపై మండిపడ్డ బాధితులు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌


కామారెడ్డి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): మానవత్వం మంటగలుస్తోంది. చనిపోయిన వారి మృతదేహాలను చూసైనా తోటివారి మనసు కరగడం లేదు. ‘కరోనా’తో పాటు వ్యాధి సోకిందన్న అనుమానంతో బంధువులు.. చుట్టు పక్కల ప్రాంతాల వారి సూటిపోటి మాటలతో.. కనీసం కడయాత్రైనా సజావుగా జరగని హృదయ విదాకరమైన సంఘటనలు శనివారం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు గుండె పోటుతో మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులు కామా రెడ్డి పట్టణంలోని సొంత ఇంటికి తరలించగా అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు మృతదేహాన్నే కాకుండా కుటుంబసభ్యులను కూడా అనుమతించని దారుణమి ది. దీంతో రోడ్డుపైనే అంత్యక్రియల ప్రక్రియ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక బాన్సువాడ పట్టణంలోని ఓ వృద్ధుడు కరోనాతో మృతి చెందగా అంత్య క్రియ లకు బంధువులు ముందుకు రాకపోవడంతో స్థానిక యువకులు మానవత్వం చాటి దహన సంస్కారాలను చేసిన ఘటనలు కామారెడ్డి జిల్లాలో నెలకొన్నాయి. ఇలా జిల్లాలో కరోనా బాధితుల విషయంలో సమాజం వ్యవహరిస్తున్న తీరును చూస్తుం టే మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. అధికారులు చెప్పినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. చాలా మంది కనీస మానవత్వా న్ని మరిచిపోయి కరోనా బాధితులతో అమానుషంగా వ్యవహరిస్తు న్నారు. ఎవరికైనా పాజిటివ్‌ వచ్చిందని తెలిస్తే చాలు ఆ కుటుంబాన్ని వేరుగా చూడడమే కాకుండా ఆ ప్రాంతం నుంచి వెలేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం.


సొంత ఇల్లు ఉన్నా.. రోడ్డు మీదే అంత్యక్రియల ప్రక్రియ

కామారెడ్డి పట్టణంలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో గల సాయి మణికంఠ అపార్ట్‌మెంట్‌లో సుబాష్‌చంద్రబోస్‌(72) అనే వృద్ధుడితో పాటు భార్య రజిని, కోడలు అపర్ణ నివాసముంటున్నారు. గత 20 రోజుల క్రితం సుభా ష్‌ చంద్రబోస్‌కు ఆరోగ్యం బాగోలేకుంటే హైదరాబాద్‌లోని గాంధీ ఆసు పత్రికి తరలించారు. చంద్రబోస్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గాంధీలోనే 15 రోజుల పాటు కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకోగా నెగిటివ్‌ అని తేలడంతో ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. దీంతో గత 10రోజుల నుంచి సుభాష్‌ చంద్రబోస్‌ హైదరాబాద్‌ లోని బాచ్‌పల్లిలో నివాసం ఉండే కూతురు  సీనియర్‌ జర్నలిస్ట్‌ రూపవాణి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే శుక్రవారం అర్ధరా త్రి గుండెపోటుతో చంద్రబోస్‌ మృతి చెందాడు. స్వస్థలం కామారెడ్డి కావడ ంతో కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకువచ్చారు. అయితే చంద్రబో స్‌ కరోనాతోనే మృతి చెందాడని సాయి మణికంఠ అపార్ట్‌మెంట్‌ నిర్వాహకులు భావించి మృతదేహా న్ని అపార్ట్‌మెంట్‌లోకి అనుమతి ఇవ్వలేదు. అంత్యక్రియలు అయ్యే వరకు కుటుంబ సభ్యులను కూడా అపా ర్ట్‌మెంట్‌లోకి రానివ్వలేదు.


కరో నాతో మృతి చెందలేదని గుండెపోటుతోనే చనిపోయాడని అపార్ట్‌మెంట్‌ సభ్యుల కు తెలిపినా అనుమతి ఇవ్వలేదని కూతురు రూపవాణి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదే మీ లేక హైదరాబాద్‌ రోడ్డు పక్కన ఉన్న బాధితుల ఖాళీ స్థలంలో మృతదేహాన్ని ఉంచాల్సిన దారుణ పరిస్థి తి కుటుంబసభ్యులకు ఎదురైంది. సొంత ఇల్లు ఉన్న ప్పటికీ రోడ్డు పక్కన మృతదేహాన్ని ఉంచాల్సిన పరిస్థి తి ఎదురయిందని ఇలాంటి దుస్థితి ఎవరికీ రావద్దని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల అనంతరం కుటుంబీకులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా అప్పుడు కూడా కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. కుటుం బీకులు, అపార్ట్‌మెంట్‌ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొన డంతో చివరకు బాధితులు ప్లాట్‌లోకి అనుమతిచ్చారు. తమ మామ అంత్యక్రియలు అపార్ట్‌మెంట్‌ నుంచే నిర్వహించా లనే కోరిక తీరలేదని కోడలు అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్‌మెంట్‌ వారు తీసుకున్న నిర్ణయం తమను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. కాగా. సుభాష్‌ చంద్రబోసు అంత్యక్రియలు నిర్వహించొద్దని అపార్ట్‌మెంట్‌ వాసులు చెప్పలేదని మాజీ కౌన్సిలర్‌ ప్రభాకర్‌ యాదవ్‌ అన్నారు.  ఇందు లో ఎలాంటి వాస్తవంలేదని చెప్పారు.


బాన్సువాడలో అంత్యక్రియలకు ముందుకు రాని బంధువులు

కరోనాతో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందగా అంత్యక్రి య లు చేసేందుకు బంధువులు ముందుకురాని పరిస్థితి బాన్సువాడ పట్టణం లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ పట్టణం లోని ఎన్‌జీవోస్‌ కాలనీలో ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారం రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉం టూ చికిత్స పొందుతున్నాడు. అయితే శనివారం వృద్ధు డు మృతి చెందడంతో అంత్యక్రియలకు బంధువులు ముందుకు రాలేదు. దీంతో కుటుంబీకులు అంత్యక్రియల కోసం ము న్సిపల్‌ సిబ్బంది సహాయం కోరగా వారు సైతం ముందుకు రాలేదు. స్థానికంగా ఉండే ఐదుగురు యువ కులు ముందుకు వచ్చి వృద్ధుడి మృతదేహాన్ని శ్మశానవాటికకు తర లించి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటారు.


ఇలాంటి సంఘటనలు జిల్లాలో గతంలోనూ చోటు చేసుకున్నాయి. కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డుకాలనీలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి సొంత ఇంట్లో ఉంటే అతను అక్కడి నుంచి వెళ్లి పోయేంత వరకు చుట్టు పక్కల వారు నానా రభస సృష్టించారు. దీంతో ఆ వ్యక్తి పోలీసులు, వైద్య సిబ్బందిని సంప్రదించడం వారు వచ్చి నచ్చచె ప్పినా ఆ ప్రాంతవాసులు వినకుండా అతనికి మానసిక వేదన కల్గించారు. ఇక ఎన్‌జీవోస్‌ కాలనీలోనే జిల్లా వైద్యఆరోగ్య శాఖలో పని చేసే ఓ ఉద్యోగి బంధువులకు సైతం ఇదే తరహాలో కాలనీ నుంచి దూరంగా వెళ్లిపో వాలని ఆ ప్రాంతంలోని వారు గొడవకు దిగడంతో పోలీ సులు, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది వచ్చి నచ్చచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అధికారులు చెప్పినా మారని ప్రజలు

కరోనా వైరస్‌ అనేది మానవ సమాజంలో ప్రతి ఒక్కరికీ సోకే అవకా శాలు ఉంటాయని అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైరస్‌ బారినపడిన వారికి చేయూతను అందించాలే తప్ప వారిని సమాజ ంలో వెలివేసే విధంగా ప్రవర్తించవద్దని ప్రభుత్వం, అధికారులు ఎంతగా నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు హోంక్వారంటైన్‌లోనే ఉండాలని వారికి కావాల్సిన వైద్య సహాయం అందిస్తామని సర్కారు చెప్పడంతో చాలా మంది ఇళ్లలోనే ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి వైద్య ఆరోగ్యసిబ్బంది అవసరమైన వైద్యం మందులు అందిస్తు న్నారు. చాలా మంది ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇరుగుపొరుగు జనాలు మాత్రం పాజిటివ్‌ కేసుల విషయంలో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. తమ వీధిలో ఒకరికి వైరస్‌ వచ్చిందం టే వారి ద్వారా తామందరికీ వ్యాప్తి చెందుతుందంటూ వింత వాదనలకు దిగుతున్నారు. వైద్యులు, అధికారులు వెళ్లి సముదాయించినా వినిపించుకో వడం లేదు.


పుట్టెడు దు:ఖంలో ఉంటే ఇలాగేనా చేసేది!?

రూపవాణి (మృతుడు సుభాష్‌ చంద్రబోసు కుమార్తె)

తండ్రి చనిపోయి.. నేను పుట్టెడు దు:ఖంలో ఉంటే అపార్ట్‌మెంట్‌ సభ్యులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని తాము ఊహించలేదని మృతుడు సుభాష్‌ చంద్రబోసు కుమార్తె, సీనియర్‌ జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి కరోనాతో మృతి చెందలేదని, గుండెపోటుతోనే చనిపోయాడని అపార్ట్‌మెంట్‌ సభ్యు లకు తెలిపినా.. కనీస మానవత్వం లేకుండా దారుణంగా ప్రవర్తించా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్ట్‌మెంట్‌ ప్రతినిధులు తమ పట్ల అమానుషంగా వ్యవహరించారని, కష్టకాలంలో తమను తీవ్ర ఇబ్బందు లకు గురి చేశారని మండిపడ్డారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసిన సాయి మణికంఠ అపార్ట్‌మెంట్‌ కమిటీ సభ్యులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా పోరాడుతా..


జిల్లాలో 329  పాజిటివ్‌ కేసుల నమోదు

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి జిల్లాలో మంగళవారం 329 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఆయా ఆసుపత్రులలో నిర్వహించిన ర్యాపిడ్‌ టెస్ట్‌లలో 329 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో కామారెడ్డి 33, బాన్సువాడ 12, ఎల్లారెడ్డి 20, దోమకొండ 17, మద్నూర్‌ 1, పిట్లం 11, బిచ్కుంద 6, అన్నారం 11, భిక్కనూరు 22, బీబీపేట 20, ఎర్రాపహాడ్‌ 13, రామారెడ్డి 18, రాజంపేట 8, మాచారెడ్డి 4, ఎస్‌ఎస్‌ నగర్‌ 4, దేవునిపల్లి 6, రాజీవ్‌నగర్‌ 37, నాగిరెడ్డిపేట 6, మత్తమాల్‌ 4, లింగంపేట 2, ఉత్తునూర్‌ 12, బీర్కూర్‌ 24, డోంగ్లి 2, హనుమాజీపేట 4, నిజాంసాగర్‌ 27, జుక్కల్‌ 2, పుల్కల్‌ 4 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-09-06T09:38:14+05:30 IST