AP News: మా పొట్ట కొట్టొద్దు : ఫ్లెక్సీ ప్రింటర్స్

ABN , First Publish Date - 2022-10-04T01:45:57+05:30 IST

Amaravathi: పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఫ్లెక్సీల వినియోగానికి చెక్ పెట్టింది. ఫ్లెక్సీలు వాడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది కూడా. ఫ్లెక్సీల వినియోగిస్తే అడుగుకు రూ. 100 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమ కడుపుకొట్టొద్దని ఫ్లెక్సీ ప్రింటర్లు సీఎం జగన్‌ను వేడుకుంటు

AP News: మా పొట్ట కొట్టొద్దు :  ఫ్లెక్సీ ప్రింటర్స్

Amaravathi: పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఫ్లెక్సీల వినియోగానికి చెక్ పెట్టింది. ఫ్లెక్సీలు వాడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది కూడా. ఫ్లెక్సీల వినియోగిస్తే అడుగుకు రూ. 100 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమ కడుపుకొట్టొద్దని ఫ్లెక్సీ ప్రింటర్లు సీఎం జగన్‌ను వేడుకుంటున్నారు. ఫ్లెక్సీల బ్యాన్ ప్రకటనపై ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ఫ్లెక్సీ పరిశ్రమతో తీవ్రనష్టాలు చవిచూశామని సీఎం జగన్‌కు రాసిన లేఖలో తమ కష్టాలను విన్నవించారు. అప్పులపాలయిన తాము బ్యాంకు రుణాలు కూడా తీర్చే స్థితిలో లేమని, కనీసం ఆ అప్పులు చెల్లించేందుకైన నిర్ణయాన్ని వాయిదా వేయాలని లేకపోతే  లక్షల కుటుంబాలు రోడ్డునపడతాయని లేఖలో పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-04T01:45:57+05:30 IST