Flight delayed: విమానం పక్కసీట్లోని వ్యక్తి చాటింగ్.. చూసినందుకు ఆరు గంటలు ఆగిపోయిన ఫ్లైట్

ABN , First Publish Date - 2022-08-15T22:16:47+05:30 IST

పక్క సీట్లోని వ్యక్తి మొబైల్ చాటింగ్ చూసినందుకు ఓ విమానం ఆరు గంటలపాటు ఆగిపోయింది. కర్ణాటకలోని

Flight delayed: విమానం పక్కసీట్లోని వ్యక్తి చాటింగ్.. చూసినందుకు ఆరు గంటలు ఆగిపోయిన ఫ్లైట్

మంగళూరు: పక్క సీట్లోని వ్యక్తి మొబైల్ చాటింగ్ చూసినందుకు ఓ విమానం ఆరు గంటలపాటు ఆగిపోయింది. కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో ఆదివారం (ఆగస్టు 14న) జరిగిందీ ఘటన. విమానం మంగళూరు నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ సీట్లలో కూర్చుని సీటు బెల్టులు బిగించుకున్నారు. ఇంతలో పక్క సీట్లోని ప్రయాణికుడు ఓ అమ్మాయితో చేస్తున్న చాటింగ్‌పై అతడి పక్కన కూర్చున్న వ్యక్తి దృష్టి పడింది. ఆ చాటింగ్ అనుమానాస్పందంగా అనిపించి వెంటనే కేబిన్ సిబ్బందికి దృష్టికి తీసుకెళ్లాడు.


వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులందరినీ ఖాళీ చేయించారు. అనంతరం విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. అనుమానాస్పద చాటింగ్ చేస్తున్న కుర్రాడు ముంబై వెళ్తుంగా, అతడితో చాటింగ్ చేస్తున్న యువతి అదే విమానాశ్రయంలో బెంగళూరు వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తోంది. వారిద్దరూ మంచి స్నేహితులు. సరదా కోసమే తాము అలా చాటింగ్ చేసుకున్నామని వారు భద్రతా సిబ్బందికి చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.


14బి సీట్‌లో కూర్చున్న ప్రయాణికుడు 13ఎ సీట్‌లో కూర్చున్న వ్యక్తికి వచ్చిన మెసేజ చూశాడు. అందులో ‘యు ఆర్ ద బాంబర్’ (U r da bomber) అని ఉండడంతో చూసి హడలిపోయాడు. వెంటనే కేబిన్ క్రూ దృష్టికి ఈ విషయన్ని తీసుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. స్నేహితులు ఇద్దరూ వాట్సాప్‌లో చాటింగ్ చేసుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో పక్కనున్న ప్రయాణికుడు ఆ చాటింగ్ చూసి భయపడడమే ఈ మొత్తం ఘటనకు కారణమని అన్నారు. విమానం తనిఖీ నేపథ్యంలో దాదాపు ఆరు గంటలపాటు ఆగిపోయింది. ఇండిగో విమాన అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 


ఈ మొత్తం గందరగోళానికి కారణమైన యువకుడిని ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అతడు విమానంలో ప్రయాణించలేకపోయాడు. మరోవైపు, అతడితో చాటింగ్ చేసిన యువతికి కూడా బెంగళూరు విమానం మిస్సయింది. కాగా, విమానం ఆరుగంటలపాటు ఆగిపోవడంతో అందులోని 185 మంది ప్రయాణికులను సాయంత్రం ఐదు గంటలకు మరో విమానంలో పంపించారు. 

Updated Date - 2022-08-15T22:16:47+05:30 IST