విమానం నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ స్వాధీనం

ABN , First Publish Date - 2020-08-08T16:29:12+05:30 IST

కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి పౌరవిమానయాన శాఖ అధికారులు డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్, ఫ్లోరు బోర్డు నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డరులను స్వాధీనం చేసుకున్నారు.....

విమానం నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ స్వాధీనం

కోజికోడ్ (కేరళ): కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి పౌరవిమానయాన శాఖ అధికారులు డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్, ఫ్లోరు బోర్డు నుంచి కాక్‌పిట్ వాయిస్ రికార్డరులను స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ సహాయపడుతుందని విమానయాన శాఖ అధికారులు చెప్పారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వి. మురళీధరన్, ఎయిర్ ఇండియా సీఎండీతో కలిసి ప్రమాద స్థలానికి వచ్చి రెండు ముక్కలైన విమానాన్ని పరిశీలించారు. విమాన ప్రమాదం అనంతరం సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న కోజికోడ్ విమానాశ్రయ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు చేసి, వారిని క్వారంటైన్ కు తరలిస్తామని కేరళ వైద్యఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. 

Updated Date - 2020-08-08T16:29:12+05:30 IST