ఆకాశ ఎయిర్
ముంబై: ఈ ఏడాది జూన్ నుంచి దేశంలో తమ విమాన సేవలు ప్రారంభమవుతాయని బడ్జెట్ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ప్రకటించింది. కంపెనీ సీఈఓ వినయ్ దూబే ఈ విషయం వెల్లడించారు. సర్వీసులు ప్రారంభించిన ఏడాదిలోగా 18 విమానాలు, ఐదేళ్లలోగా 72 విమానాలతో తమ విమాన సేవలు ఉంటాయన్నారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ ఎయిర్ ప్రధాన ప్రమోటర్. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు తమ విమాన సర్వీసులు ఉంటాయని దూబే చెప్పారు.