Indians: విదేశాల్లోని ప్రవాసులకు పండగపూట పండగలాంటి వార్త.. అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా..

ABN , First Publish Date - 2022-09-19T14:53:59+05:30 IST

విదేశాల్లో నివసిస్తూ పండగపూట కుటుంబ సభ్యులతో గడిపేందుకు స్వస్థలాలకు రావాలనునే భారతీయుల(NRIs)కు ఇది నిజంగా పండగలాంటి వార్త. అలాగే.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించుకుంటు

Indians: విదేశాల్లోని ప్రవాసులకు పండగపూట పండగలాంటి వార్త.. అలాగే ఒక బ్యాడ్ న్యూస్ కూడా..

ఎన్నారై డెస్క్: విదేశాల్లో నివసిస్తూ పండగపూట కుటుంబ సభ్యులతో గడిపేందుకు స్వస్థలాలకు రావాలనునే భారతీయుల(NRIs)కు ఇది నిజంగా పండగలాంటి వార్త. అలాగే.. భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్న భారతీయులకు ఇది చేదు వార్త. విదేశాల నుంచి వచ్చే భారతీయులు అతి తక్కువ మొత్తంతో ఇండియా చేరుకోవచ్చు. ఇదే సమయంలో ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికుల ప్రయాణం భారం అవుతోంది. ఇంతకూ అసలు విషయం ఏంటంటే..



యూఏఈ నుంచి భారత్‌(UAE-INDIA)కు వచ్చే విమాన టికెట్ ఛార్జీల(flight ticket prices)ను ఎయిర్‌లైన్ సంస్థలు భారీగా తగ్గించాయి. మొన్నటి వరకు రూ.64వేల వరకు ఉన్న టికెట్ ధరలు ఇప్పుడు అమాంతం సుమారు రూ.6వేలకు తగ్గాయి. ఇదే సమయంలో భారత్ నుంచి యూఏఈ వెళ్లే విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. కొచ్చి నుంచి దుబాయ్ లేదా అబుధాబి  వెళ్లాలంటే ప్రస్తుతం విమాన టికెట్ రూ.25వేల వరకూ ఉంది. 


ఇదిలా ఉంటే.. హాలిడేస్ సందర్భంగా జూలై-ఆగస్టు నెలల మధ్య టికెట్ల ధరలను భారీగా పెంచడం వల్ల విమానయాన సంస్థలు లాభాలు పొందినట్టు కొందరు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. నవంబర్ వరకు తగ్గిన టికెట్ రేట్లే అమలులో ఉంటాయన్నారు. మళ్లీ నవంబర్ తర్వాత యూఏఈ-భారత్ మధ్య ప్రయాణించే విమానాల టికెట్ ధరలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. 


Updated Date - 2022-09-19T14:53:59+05:30 IST