విమానాల రాకపోకలకు అంతరాయం

ABN , First Publish Date - 2022-06-21T13:05:25+05:30 IST

వర్షం కారణంగా 31 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన చిరుజల్లులు ఉరుములు, మెరుపులతో

విమానాల రాకపోకలకు అంతరాయం

ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 20: వర్షం కారణంగా 31 విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నగరంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన చిరుజల్లులు ఉరుములు, మెరుపులతో భారీవర్షంగా మారింది.  ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకు 31 విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. జర్మనీ, దోహా, దుబాయ్‌, ముంబై నుంచి వచ్చిన విమానాలు చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు వాతావరణం సహకరించకపోవడంతో హైదరాబాద్‌, బెంగుళూరుకు మళ్లించారు. అలాగే, మలేసియా, థాయ్‌ల్యాండ్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ నుంచి వచ్చిన 12 విమానాలు చాలాసేపు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వర్షం తగ్గడంతో విమానాలు ఒక్కొక్కటిగా ల్యాండింగ్‌ అయ్యాయి. అలాగే, చెన్నై నుంచి 8 అంతర్జాతీయ విమానాలు సహా 15 విమానాలు ఆలస్యంగా బయల్దేరాయి.

Updated Date - 2022-06-21T13:05:25+05:30 IST