Flipkart Big Billion Days Sale 2022: రూ. 999కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ!

ABN , First Publish Date - 2022-09-25T02:04:13+05:30 IST

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ 2022 (Flipkart Big Billion Days Sale 2022) రెండో రోజులోకి ఎంటరైంది. స్మార్ట్‌ఫోన్లు,

Flipkart Big Billion Days Sale 2022: రూ. 999కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ!

బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ 2022 (Flipkart Big Billion Days Sale 2022) రెండో రోజులోకి ఎంటరైంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, వేరబుల్స్ ఇతర యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్లు ఊరిస్తున్నాయి. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ కార్డు హోల్డర్లకు 10 శాతం తక్షణ రాయితీ కూడా ఉంది. సేల్ సందర్భంగా వచ్చే కొత్త వినియోగదారులు సైన్ అప్ చేయడం ద్వారా రూ. 100 రాయితీని కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా బ్రాండెడ్ టీవీలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌టీవీ కోసం కనుక ఎదురు చూస్తున్నట్టు అయితే ఇది చక్కని అవకాశమే.  


* ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022(Flipkart Big Billion Days Sale 2022)లో భాగంగా కొడక్ 7ఎక్స్‌ప్రొ (KODAK 7XPRO) సిరీస్‌ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని రూ. 8,999కే అందుబాటులో ఉంచింది. దీని అసలు ధర రూ. 18,499 కాగా, ఎక్స్‌చేంజ్‌లో భాగంగా రూ. 8 వేల ఆఫర్ ప్రకటించింది. అంటే పాత టీవీతో కనుక ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ. 999కే దీనిని సొంతం చేసుకోవచ్చు.  ఐసీఐసీఐ, యాక్సెస్, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ కార్డుల ద్వారా కొనుక కొనుగోలు చేస్తే రూ. 1,750 వరకు తగ్గింపు లభిస్తుంది. 


* మోటోరోలాహెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (MOTOROLA Revou 2 80 cm (32 inch) HD Ready LED Smart Android TV)ని రూ. 10,999కే లిస్ట్ చేసింది.  దీని అసలు ధర రూ. 20 వేలు. యాక్సెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ. 1,750 వరకు ఆదా చేసుకోవచ్చు. పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 9వేల డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడీ టీవీ రూ.1,999రూ సొంతమవుతుంది.


* ఐఫాల్కన్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (iFFALCON HD Ready LED Smart Android TV)ని కూడా అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ టీవీ రూ. 8,999కే అమ్మకానికి ఉంది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం, గరిష్టంగా రూ. 1,750 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, పాత టీవీ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ. 8 వేలు లభిస్తుంది. ఫలితంగా ఈ 32 అంగుళాల టీవీని కేవలం రూ. 999కే ఇంటికి తెచ్చుకోవచ్చు.


* థామ్సన్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ (Thomson Smart Android TV)ని కూడా అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంచింది. దీనిని రూ. 999కే సొంతం చేసుకునే వెసులుబాటు ఉంది. దీని అసలు ధర రూ.14,499. సేల్‌లో భాగంగా రూ.8,999కే వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ. 8 వేల వరకు ఇస్తోంది. అప్పుడీ టీవీ రూ. 999కే లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ లేకుండా అయితే, ఐసీఐసీఐ, యాక్సిక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డులపై గరిష్టంగా రూ. 1,750 వరకు రాయితీ లభిస్తుంది. 


* ఇవి కాకుండా ఐఫోన్ 13, ఐఫోన్ 11, గూగుల్ పిక్సెల్ 6ఎ, నథింగ్ ఫోన్ 1, రియల్‌మి 9 ప్రొ 5జి ఫోన్లపై  ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ నెల 23న మొదలైన ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ 2022 (Flipkart Big Billion Days Sale 2022) ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. 


Updated Date - 2022-09-25T02:04:13+05:30 IST