ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది.. వీటిపై భారీ ఆఫర్లు!

ABN , First Publish Date - 2022-03-08T00:35:47+05:30 IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌తో మరోమారు వినియోగదారుల ముందుకు..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది.. వీటిపై భారీ ఆఫర్లు!

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌తో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది. ఈ నెల 12న ప్రారంభం కానున్న ఈ సేల్ ఐదు రోజులపాటు అంటే 16వ తేదీ వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్లూటూత్ స్పీకర్లు తదితర వాటిపై డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్ల వాన కురిపించేందుకు సిద్ధమైంది. అలాగే, నిర్దిష్ట సమయాల్లో ఎంచుకోవడానికి పరిమిత కాల డీల్‌లు, ఆఫర్లను కూడా తీసుకొస్తోంది. ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులకు తక్షణ రాయితీలు కూడా తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు సేల్ ముందుగానే అందుబాటులోకి రానుంది.


ఫ్లిప్‌కార్ట్ ఈసారి యాపిల్, రియల్‌మి, పోకో, శాంసంగ్ వంటి బ్రాండ్లతోపాటు వివిధ రకాల మొబైల్స్‌పై పలు ఆఫర్లు తీసుకురానుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ రాయితీ లభించనుంది. అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది.


ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై 80 శాతం, స్మార్ట్‌వాచ్‌లు, వేరబుల్స్‌పై 60 శాతం, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేసింది. రియల్‌మి, వన్‌ప్లస్ స్మార్ట్, బ్లూటూత్ స్పీకర్లు, ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) ఇయర్ బడ్స్‌పై 80 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. కంప్యూటర్ యాక్సెసరీలపై 50 శాతం, ట్యాబ్లెట్స్‌పై 45 శాతం రాయితీ ఇవ్వనుంది. మైక్రో ఎస్డీకార్డులు, హెచ్‌డీడీలు, ఎస్ఎస్‌డీలపై 60 శాతం రాయితీ లభించనుండగా, గేమింగ్ యాక్సెసరీలపై 80 శాతం రాయితీ ఇవ్వనుంది. 


Updated Date - 2022-03-08T00:35:47+05:30 IST