Bengaluru: రోడ్లపై పారుతున్న వరదనీరు... తేలియాడుతున్న కార్లు

ABN , First Publish Date - 2021-11-23T17:09:29+05:30 IST

త పది వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రోడ్లపై వరదనీరు పారుతుండటంతో కార్లు తేలియాడుతున్నాయి....

Bengaluru: రోడ్లపై పారుతున్న వరదనీరు... తేలియాడుతున్న కార్లు

బెంగళూరు : గత పది వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రోడ్లపై వరదనీరు పారుతుండటంతో కార్లు తేలియాడుతున్నాయి. యలహంక చెరువు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొగిలు క్రాస్, నాగవర, విద్యారణ్యపుర, యెలహంక ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. వరద ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సహాయ పనులు చేపట్టారు. వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి లక్షరూపాయల పరిహారన్ని వెంటనే అందచేస్తున్నామని సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు. యెలహంక, సింగపూర్, అమనీకెరి, ఆళ్ల సంద్ర చెరువులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. 


చెరువుల సమీపంలోని కేంద్రీయ విహార్ సొసైటీ వరదనీటిలో మునిగిపోవడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే ఎస్ ఆర్ విశ్వనాథ్, బెంగళూరు మున్సిపల్ చీఫ్ గౌరవ్ గుప్తా, చీఫ్ ఇంజినీర్ రంగనాథ్ లు యెలహంక జోన్ కెంపెగౌడ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.


Updated Date - 2021-11-23T17:09:29+05:30 IST