మళ్లీ ముంచుతుంది

ABN , First Publish Date - 2022-08-18T06:05:27+05:30 IST

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

మళ్లీ ముంచుతుంది
గోదావరి వరద ఉధృతికి మళ్లీ నీట మునిగిన కొవ్వూరు గోష్పాదక్షేత్రం

గోదావరిలో తగ్గని వరద ఉధృతి

రెండో ప్రమాద స్థాయిలోనే ప్రవాహం

నీట మునుగుతున్న లంకలు

ఏటిగట్లపైకి చేరిన పశువులు

ఆందోళనలో రైతాంగం

ముంపులోనే గోష్పాదక్షేత్రం

భద్రాచలం వద్ద తగ్గుముఖం 


ధవళేశ్వరం/కొవ్వూరు/నిడదవోలు/పెరవలి, ఆగస్టు 17 : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద గోదావరి తీరప్రాంత ప్రజలతో దోబూచులాడుతోంది. గత కొన్నిరోజులుగా  ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు ఉపనదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన భద్రాచలం, దిగువన ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికలు దాటి వరద పెరగడంతో కొవ్వూరు, రాజమహేంద్రవరంల మధ్య అఖండ గోదావరి తన సహజత్వానికి విరుద్ధంగా సుడులు తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ప్రమాద భరితంగా మారుతుంది.  ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుండగా భద్రాచలం వద్ద తగ్గు ముఖం పడుతుంది. ధవళేశ్వరం వద్ద బుధవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 15.20అడుగులకు పెరిగింది.వరద తగ్గిన్నట్టే తగ్గి మరోసారి కొవ్వూరు గోష్పదక్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాలను ముంచెత్తింది.క్షేత్రంలోని షిరిడి సాయిబాబా ఆలయం వరదనీటిలో మునిగి పోయింది.క్షేత్రానికి వచ్చే రహాదారులపై వరదనీరు ప్రవహిస్తుంది. ఇదిలా ఉండగా మంగళవారం  నాటి కంటే బుధవారం సాయంత్రానికి పల్లపు లంక భూముల్లో నీరు చేరుకుంది. గురువారం నాటికి మరింత పెరి గి మెరక భూముల్లో కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.లంకభూముల్లోని పశువులను ఇప్పటికే ఏటిగట్ల పైకి తరలించారు.నిడదవోలు మండలం విజ్జేశ్వరం బ్యారేజీ సమీ పంలో ఉన్న శ్మశాన వాటిక సైతం గోదావరి వరదకు మునిగింది. మరోపక్క బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతానికి విజ్జేశ్వ రం,ర్యాలి, మద్దూరు, ధవళేశ్వరం బ్యారేజీల నుంచి గోదావరికి వచ్చ చేరుతున్న అదనపు జలాలను 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడు దల చేసినట్టు నీటిపారుదల శాఖాధికారులు తెలిపారు. 


Updated Date - 2022-08-18T06:05:27+05:30 IST