ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-11-10T16:19:10+05:30 IST

వారం రోజులుగా కురు స్తున్న భారీవర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతా లను జిల్లా కలెక్టర్‌ అల్బీ జాన్‌వర్గీస్‌ మంగళవారం పరి శీలించారు. తిరువళ్లూర్‌ జిల్లా చోళవరం యూనియన్‌ ఆరణి స

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

గుమ్మిడిపూండి(చెన్నై): వారం రోజులుగా కురు స్తున్న భారీవర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతా లను జిల్లా కలెక్టర్‌ అల్బీ జాన్‌వర్గీస్‌ మంగళవారం పరి శీలించారు. తిరువళ్లూర్‌ జిల్లా చోళవరం యూనియన్‌ ఆరణి సమీపంలోని సిరువాపురిలో అధికంగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కురసిన వర్షాలకు ఆ ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. దెబ్బతిన్న పొలాలను, ముంపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌, నష్టపోయిన పంట వివరాలు నమోదుచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట యూనియన్‌ కార్యదర్శి సెల్వశేఖర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దయాళన్‌, స్థానిక పంచాయతీ అధ్యక్షులు ఝాన్సీ రాణిలతో పాటు పలువురు అధికారులు వున్నారు.


Updated Date - 2021-11-10T16:19:10+05:30 IST