‘వెలిగొండ’ సొరంగంలోకి వరద లీకేజీ

ABN , First Publish Date - 2021-07-27T07:57:54+05:30 IST

వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలోకి హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వరద నీరు లీకేజీ అవుతోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే సొరంగం ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి

‘వెలిగొండ’ సొరంగంలోకి వరద లీకేజీ

వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలోకి హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వరద నీరు లీకేజీ అవుతోంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే సొరంగం ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులోని కీలకమైన మొదటి సొరంగం పనులు ఇటీవలే పూర్తిచేశారు. ఆ సొరంగానికి కృష్ణా నదికి అనుసంధానంగా కొల్లంవాగు వద్ద నిర్మించిన హెడ్‌రెగ్యులేటర్‌ పనులూ చేశారు. దీనికి రెండు గేట్లు ఏర్పాటు చేశారు. గేట్ల మీదుగా వరద సొరంగం లోపలికి చేరుతోంది. దీనికి మరమ్మతులు చేయాల్సి ఉంది. లీకేజీ వల్ల రెండో సొరంగం పనులు నిలిచిపోయాయి.     

-పెద్దదోర్నాల

Updated Date - 2021-07-27T07:57:54+05:30 IST