జోరుగా కోడి పందాలు, గుండాట

ABN , First Publish Date - 2021-04-23T06:59:10+05:30 IST

అధికార పార్టీ నేతలు, పోలీసుల అండదండలు.. ఇంకేముంది రెచ్చిపోయారు. అంతా కరోనాతో భయాందోళన చెందుతున్నా ఫ్లడ్‌లైట్ల వెలుగులో బారీగా జనసందోహం మధ్య కోడిపందాలు, గుండాటలు నిర్వహించారు.

జోరుగా కోడి పందాలు, గుండాట
పిఠాపురం మండలం జములపల్లిలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో జోరుగా కోడిపందాలు, గుండాట

  • ఫ్లడ్‌లైట్ల వెలుగులో బరితెగింపు
  • అటువైపు చూడని పోలీసులు
  • నామమాత్రంగా కేసు నమోదు

పిఠాపురం రూరల్‌, ఏప్రిల్‌ 22: అధికార పార్టీ నేతలు, పోలీసుల అండదండలు.. ఇంకేముంది రెచ్చిపోయారు. అంతా కరోనాతో భయాందోళన చెందుతున్నా ఫ్లడ్‌లైట్ల వెలుగులో బారీగా జనసందోహం మధ్య కోడిపందాలు, గుండాటలు నిర్వహించారు. పందాలు జరిగినంతసేపు అటువైపు చూడని పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. పిఠాపురం మం డలం జములపల్లిలోని మామిడితోటల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 4గంటల వరకూ భారీగా కోడిపందాలు, గుండాటలు జరిగాయి. ఎక్కడిక్క డ ఫ్లడ్‌లైట్లు వేసి మరీ పందాలు నిర్వహించారు. కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో అంతా అందోళన చెందుతుండగా వీరు ఏమాత్రం పట్టించుకోకుండా భారీ గా ప్రజలు గుమిగూడారు. కనీసం మాస్కులు ధరించలేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పందాలు జరగడంతో పోలీసులు అటువైపు చూడకపోవడంతో పందాలు జోరుగా సాగాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేశారు. రెండు కోళ్లు, రెండు ఫ్లడ్‌లైట్లు స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించారు. ఇందులో ఆర్గనైజర్లపై ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. మండలంలోని పలు గ్రామాల్లో కొద్ది రోజులుగా పండుగల పేరిట జోరుగా కోడిపందాలు, గుండాటలు, పేకాటలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-04-23T06:59:10+05:30 IST