నిజాంసాగర్‌కు వరద

ABN , First Publish Date - 2021-07-24T07:10:47+05:30 IST

Flood to Nijansagar

నిజాంసాగర్‌కు వరద
నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం


ఎగువ నుంచి 12,500 క్యూసెక్కుల నీరు రాక
జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

నిజాంసాగర్‌, జూలై 24 :
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోనికి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 12500 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టును నమ్ముకున్న ఉభయ జిల్లాల రైతన్న కలలు పండనున్నాయి. ప్రతీయేటా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వర్షా కాలం మొదట్లో వర్షాలు కురియక నిజాంసాగర్‌లో ప్రాజెక్టు నీరు అంతంత మాత్రంగానే ఉండేది. వర్షాకాలం మొదట్లో రైతులు ఆందోళన చెందే వారు. కానీ, ఈ ఏడాది ప్రారంభం లోనే వర్షాలు కురియడంతో ప్రాజెక్టు లోకి మంజీరా వెంట భారీ వరద వస్తోంది. ఉభయ జిల్లాల రైతాంగం నిజాంసాగర్‌ ప్రాజెక్టు సాగునీరు అందించనుంది. 1405 అడుగులకు గాను 1396.46 అడుగులకు చేరుకుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 17.802 టీఎంసీలకు గాను 8.841 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరుకుంది. భారీ వరద నీరు వస్తుండడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి క్రమేపి నీరు వచ్చి చేరడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలను సాగుచేస్తున్న రైతులు గత ఏడాది నుంచి పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉంటూ వర్షాకాలం యాసంగిలకు సాగునీరు అందించేందుకు ఉభయ జిల్లాల రైతులు దిగాలు పడుతున్నారు.
సింగీతం, కళ్యాణి, కౌలాస్‌ నాలా వరద గేట్లు ఎత్తివేత...
చిన్న నీటి వనరులైన సింగీతం, కళ్యాణి వరద గేట్లను శుక్రవారం ఎత్తివేశారు. ఈ రిజర్వాయర్ల ద్వారా 5 వేల క్యూసె క్కుల నీటిని వదులుతున్నారు. సింగీతం రిజర్వాయర్‌లో 416. 450 మీటర్లకు గాను పూర్తి నీటి సామర్థ్యం చేరుకోగా, ఎగువ ప్రాంతం నుంచి వర ద నీటిని గు రువారం సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి దుర్గారె డ్డిలు వరద గేట్లను ఎత్తి ప్రధాన కాల్వలోకి నీటిని వి డుదల చేశారు. సింగీతం పొంగి పొర్లుతుం డడంతో పర్యాటకులు నీటిని ఆస్వాదించడానికి వస్తున్నారు.  కౌలాస్‌నాలాలో ఎగువ ప్రాంతాల నుంచి 1755 క్యూసెక్కుల వరద వస్తోంది. మూడు రోజులుగా వరద నీటిని ప్రాజెక్టు 4, 5, 6 గేట్లను ఎత్తి 1755 కూసెక్కుల నీటిని దిగువన విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ రికలు జారీచేశారు.

Updated Date - 2021-07-24T07:10:47+05:30 IST