జలాశయాలకు పోటెత్తుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-22T06:53:58+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. ఈ యేడాది ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి

జలాశయాలకు పోటెత్తుతున్న వరద

ఎస్సారెస్పీకి లక్షా72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ప్రాజెక్టు 40 గేట్ల ఎత్తివేత


నిజామాబాద్‌,  సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ మెండోరా: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉంది. ఈ యేడాది ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 155 టీఎం సీల వరద వచ్చింది. అధికారులు ప్రాజెక్టులో 85 టీఎంసీల నీటిని నిల్వను ఉంచి 70 టీఎంసీలకుపైగా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురవడంతో అక్కడి నుంచి వరద శ్రీరాంసాగ ర్‌కు వచ్చి చేరుతోంది. సోమవారం గోదావరి, మంజీరా న దుల ద్వారా ప్రాజెక్టులోకి లక్షా 72 వేల క్యూసెక్కుల వరద రాగా.. అధికారులు ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి లక్షా క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూన్‌, జూలై నెలల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నామమాత్రపు వరద రా గా.. ఆగస్టు నుంచి భారీగా వచ్చి చేరుతోంది. గడిచిన నెల న్నర రోజులుగా ప్రాజెక్టులోకి ఆగకుండా వరద వస్తోంది. గడిచిన పది రోజులుగా యాభై వేల క్యూసెక్కుల నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. మొద ట ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపిన అధికారులు.. గోదా వరి, మంజీరా నదుల నుంచి వరద భారీగా రావడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ పెరగడంతో 1,090 అడుగుల నీటిని ప్రాజెక్టులో నిల్వ చేస్తూ మిగులు నీటిని దిగువకు విడుద ల చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని ఉంచుతూ.. మిగతా నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు వరద వచ్చే అవకాశం ఉండ డంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు కు భారీగా వరద వస్తుండడంతో కందకుర్తి వద్ద నీటిమ ట్టం బాగా పెరిగింది. బ్యాక్‌ వాటర్‌ పెరగడంతో నీటిమ ట్టం కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90 టీఎం సీలకు గాను 85 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా వరద ను దిగువకు వదులుతున్నారు. వరద ప్రవాహం తగ్గగానే ప్రాజెక్టును మొత్తం నింపుతామని ఈఈ రామారావు, డీఈ జగదీష్‌ తెలిపారు. ఎగువ నుంచి ఎక్కువ వరద వస్తో ందని వారు తెలిపారు. 

Updated Date - 2020-09-22T06:53:58+05:30 IST