floods: మళ్లీ పెరుగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2022-08-16T00:56:39+05:30 IST

భద్రాచలం (Bhadrachalam) వద్ద గత 24గంటలుగా తగ్గుతూ వచ్చిన గోదావరి (godavari) నీటిమట్టం సోమవారం మళ్లీ పెరుగుదల నమోదైంది.

floods: మళ్లీ పెరుగుతున్న గోదావరి

భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గత 24గంటలుగా తగ్గుతూ వచ్చిన గోదావరి (godavari) నీటిమట్టం సోమవారం మళ్లీ పెరుగుదల నమోదైంది. ఆదివారం అర్ధరాత్రి 12గంటలకు 49.3 అడుగులున్న నీటిమట్టం సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు 47.8 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను భద్రాచలం సబ్‌ కలెక్టరు వెంకటేశ్వర్లు ఉపసంహరించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు 47.5 అడుగులకు, మధ్యాహ్నం 3 గంటలకు 46.3 అడుగులకు తగ్గింది. అనంతరం సాయంత్రం ఆరు గంటల వరకు 46.3 అడుగుల నిలకడగా ఉంది. ఆ తరువాత ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఏటూరునాగారం, పేరూరు వద్ద వరద పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మళ్లీ గోదావరి 50అడుగులు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-08-16T00:56:39+05:30 IST