ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకింది. కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. తాను చేసిన తప్పు మరేవరూ చేయొద్దని ప్రజలను వేడుకుంటుూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘కరోనా వైరస్ను నేను కేవలం ఫ్లూ మాదిరిగానే చూశాను. క్రమంగా అది కనుమరుగవుతుందని భావించా. మాస్క్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదనుకుని భ్రమపడ్డాను. ప్రస్తుతం నేను మహమ్మారి బారినపడ్డాను. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. నేను చేసిన పొరపాటును మీరు చేయకండి. దయచేసి అందరూ మాస్క్ ధరించండి’ అని పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలో ఇప్పటి వరకు దాదాపు 14లక్షల మంది కొవిడ్ బారినపడగా.. ఇందులో 22వేలకు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.