4ఏళ్ల బాలుడిపై ఫ్లోరిడా మహిళ అమానుష చర్య..!

ABN , First Publish Date - 2022-04-13T16:44:53+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

4ఏళ్ల బాలుడిపై ఫ్లోరిడా మహిళ అమానుష చర్య..!

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడిని ఓ మహిళ ల్యాండ్రీ డ్రైయర్‌లో వేసి స్వీచ్చాన్ చేసింది. దాంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళను శనివారం(ఏప్రిల్ 9న) పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆమెపై పోలీసులు పిల్లలపై తీవ్రమైన వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలో ఉండే అంబర్ చాప్‌మన్‌ అనే మహిళ ఈ అమానుష చర్యకు పాల్పడింది. 


చాప్‌మన్ నాలుగేళ్ల పిల్లోడిని కొన్ని టవల్స్‌తో కలిపి ల్యాండ్రీ డ్రైయర్‌లో వేసి, మెషిన్‌ను ఆన్ చేసింది. దాంతో లోపల ఉన్న బాబు భయంతో అరుస్తుండడం చూసి ఆమె బయట రాక్షసానందం పొందింది. అలా మెషిన్ నడుస్తుండగానే మధ్యలో ఒకసారి దాని డోర్‌ను కూడా తెరిచిందట. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆస్పత్రి సిబ్బందితో బాలుడు జరిగిన విషయం చెప్పడంతో వారు లేక్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాప్‌మన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాలుడి పట్ల ఆమె అలా అమానుషంగా ఎందుకు ప్రవర్తించిందనే విషయాన్ని మాత్రం పోలీసులు చెప్పలేదు. 

Updated Date - 2022-04-13T16:44:53+05:30 IST