Flower display: ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-07T16:06:10+05:30 IST

తెన్‌కాశి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన కుట్రాలంలో ఉద్యానవన శాఖ నిర్వహిస్తున్న పుష్ప ప్రదర్శన(Flower display) అందర్నీ

Flower display: ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శన

ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 6: తెన్‌కాశి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన కుట్రాలంలో ఉద్యానవన శాఖ నిర్వహిస్తున్న పుష్ప ప్రదర్శన(Flower display) అందర్నీ ఆకట్టుకుంటోంది. కుట్రాలంలో ఏటా సీజన్‌ సమయంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పుష్ప ప్రదర్శన నిర్వహిస్తుంటారు. 2019 సీజన్‌లో జలపాతాల్లో నీరు లేని కారణంగా పుష్ప ప్రదర్శన నిర్వహించలేదు. ఆ తర్వాత రెండేళ్లలో కరోనా వ్యాప్తి కారణంగా కుట్రాలం జలపాతాల సందర్శనను నిషేధించారు. మూడేళ్ల అనంతరం ఈ ఏడాది పుష్ప ప్రదర్శనను శుక్రవారం  కలెక్టర్‌ ఆకాష్‌(Collector Akash) ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ వరకు ఫుడ్‌ ఫెస్టివల్‌, బుక్‌ ఎగ్జిబిషన్‌, ఉద్యానవనోత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-07T16:06:10+05:30 IST