ఫ్లోరైడ్‌ పాపం గత పాలకులదే

ABN , First Publish Date - 2022-08-15T06:06:25+05:30 IST

: నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ పాపం గత పాలకులదేనని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఆరోపించారు.

ఫ్లోరైడ్‌ పాపం గత పాలకులదే
సంస్థాన్‌నారాయణపురంలో మాట్లాడుతున్న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

 రౌడీయిజంతో రాజకీయం చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పుట్టగతులుండవ్‌

 విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

సంస్థాన్‌ నారాయణపురం, ఆగస్టు 14: నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ పాపం గత పాలకులదేనని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి ఆరోపించారు. సంస్థాన్‌ నారాయణపురం మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం ఇచ్చే రూ.22వేల కోట్ల కాంట్రాక్టు కోసం 13ఏళ్లపాటు ఎన్నో పదవులు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని... ఓట్లేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన నమ్మకద్రోహి రాజగోపాల్‌రెడ్డి అని అన్నారు. ఆయన బీజేపీలో చేరడం ద్వారా కాంట్రాక్టర్ల ద్వారా ఉపకారం జరగొచ్చని, మూడున్నరేళ్లుగా మునుగోడు నియోజకవర్గానికి పట్టిన విరగడయిందన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండడంవల్లే మునుగోడు నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, అందుకే బీజేపిలోకి వెళుతున్నట్లు చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి మళ్లీ ప్రతిపక్ష పార్టీలోకి వెళితే ఏవిధంగా నిధులు ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు ధరల పెరుగుదలకు అని, అదే టీఆర్‌ఏ్‌సకు వేస్తే అభివృద్ధి, సంక్షేమానికి వేసినట్లవుతుందన్నారు. గత పాలకుల పాలనలోనే మునుగోడులో ఫ్లోరైడ్‌ రక్కసి పెరిగిందన్నారు. ఇన్నాళ్లు రౌడీయింజం చేసి డబ్బులతో రాజకీయాలు చేసిన కోమటిరెడ్డి సోదరులకు ఇక నుంచి పుట్టగతులుండవని అన్నారు. 


మునుగోడులో ఈనెల 20న ప్రజాదీవెన సభ 

ఈ నెల 20వ తేదీన మునుగోడు మండలకేంద్రంలో జరిగే ప్రజాదీవెన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతున్నారని, ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి జగదీ్‌షరెడ్డి కోరారు. ప్రభుత్వ విప్‌ గొంగడి సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ కార్యకర్తల్లో కసి పెరిగిందని, ఈసారి మునుగోడులో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ మాట్లాడుతూ మునుగోడు గడ్డపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసే దాకా కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ మూడున్నరేళ్లలో మునుగోడు నియోజకర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశంగౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ జక్కిడి జంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ బోల్ల శివశంకర్‌, సర్పంచులు, ఎంపీటీసలు నాయకులు పాల్గొన్నారు.  


టీఆర్‌ఎ్‌సలో చేరిన ఆరుగురు కాంగ్రెస్‌ సర్పంచ్‌లు.. ముగ్గురు ఎంపీటీసీలు

మునుగోడు రూరల్‌: మునుగోడు మండలానికి చెందిన ఆరుగురు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు కాంగ్రె్‌సను వీడి టీఆర్‌ఎ్‌సలో చేరారు. మండలంలోని పులిపల్పుల గ్రామానికి చెందిన ఎంపీటీసీ బొల్గూరి లింగయ్య, సంస్థాన్‌నారాయణపురం మండలం గుడిమల్కాపురం కాంగ్రెస్‌ ఎంపీటీసీ శివరాత్రి కవిత, దుబ్బకాల్వ సర్పంచ్‌ మణెమ్మ మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. కిష్టాపురం ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, సర్పంచ్‌ నందిపాటి రాధారమేష్‌, జమస్థాన్‌పల్లి సర్పంచ్‌ పంతంగి పద్మస్వామిగౌడ్‌, కల్వలపల్లి సర్పంచ్‌ ఒంటెపాక జగన్‌, రావిగూడెం సర్పంచ్‌, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుర్రం సత్యం, చొల్లేడు జనిగెల మహేశ్వరి ప్రగతి భవన్‌లో ఆదివారం హైదరాబాద్‌లో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం తీసుకున్నారు. వారివెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత కంచర్ల కృష్ణారెడ్డి ఉన్నారు. 

Updated Date - 2022-08-15T06:06:25+05:30 IST