బదిలీల అలజడి

ABN , First Publish Date - 2022-08-07T04:48:27+05:30 IST

ఏఎనఎంల సర్దుబాటు అంశం ఇప్పుడు ఆ ఉద్యోగుల్లో అలజడి రేపుతోంది.

బదిలీల అలజడి

  1. ఏఎనఎంల సర్దుబాటుకు సర్కారు సిద్ధం
  2. స్థానచలనానికి ససేమిరా అంటున్న ఏఎనఎంలు
  3. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆందోళనలు


 ఏఎనఎంల సర్దుబాటు అంశం ఇప్పుడు ఆ ఉద్యోగుల్లో అలజడి రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ వారంతా ఆందోళనబాట పట్టారు. ఇన్నేళ్లుగా సేవలందిస్తున్న తమను ఉన్న ఫలంగా సచివాలయాలకు బదిలీ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం నియమితులైన వార్డు సచివాలయాల సెక్రటరీలకు పట్టణాలకు దగ్గర ఉండే ఆసుపత్రుల్లో స్థానాలు కేటాయించి ఏళ్ల తరబడి పీహెచసీల్లో పని చేస్తున్న తమను సూదూర ప్రాంతాలకు బదిలీ చేస్తే తమ పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు.


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 6: రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లోని ఏఎనఎంల ఖాళీలను సర్దుబాటు చేయాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఈ నెల 1వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం ప్రారంభిస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి పీహెచసీలో 14 మంది ప్యాట్రన ఉండేలా కుందింపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి సబ్‌సెంటర్లలో పని చేస్తున్న ఏఎనఎంలను సచివాలయాలకు సర్దుబాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం సచివాలయాలు 1,185 ఉండగా వీటిలో 958 మంది గ్రామ, వార్డుల్లో సెక్రటరీలు పని చేస్తున్నారు. ఏఎనఎంలు లేని సచివాలయాలు 226 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పబ్లిక్‌ హెల్త్‌ సెంటర్‌లో పని చేస్తున్న రెగ్యులర్‌ ఏఎనఎం, యూరోపియన, రెండవ ఏఎనఎం, 300 ఓసీఎస్‌ ఓపీ ఏఎనఎంలు మొత్తం 348 మంది ఉన్నారు.

ఫ సీనియర్‌ ఏఎనఎంలకు అన్యాయం..

ఉమ్మడి జిల్లాలో 10 నుంచి 20 సంవత్సరాలుగా రెగ్యులర్‌, రెండవ, యూరోపియన, 300 ఓసీఎస్‌, ఓపీ ఏఎనఎంలు 348 మంది పని చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీలోపు పీహెచసీల్లో పని చేస్తున్న ఏఎనఎంలను ఖాళీగా ఉన్న సచివాలయాలకు సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ నెల 8న బదిలీల కౌన్సెలింగ్‌ జరపాలని ఆదేశించారు. రెండేళ్ల క్రితం నియమితులైన వార్డు సచివాలయాలయ సెక్రటరీలకు పట్టణాల్లో దగ్గర ఉండే ఆసుపత్రుల్లో స్థానాలు కేటాయించారు. ఏళ్ల తరబడి సీనియారిటీ ఉన్న పీహెచసీల్లో పని చేస్తున్న ఏఎనఎంలకు సూదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాల హెల్త్‌ సెక్రటరీలతోపాటు పీహెచసీలో పని చేస్తున్న ఏఎనంఎలకు సమానంగా బదిలీ కౌన్సెలింగ్‌ జరపాలని రెగ్యులర్‌, యూరోపియన, రెండో ఏఎనఎంలు కోరుతున్నారు. రిటైర్డ్‌మెంటుకు దగ్గర ఉండి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పీహెచసీ ఏఎనఎంలకు సర్దుబాటు బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 

యథాస్థానంలో కొనసాగించాలి

- అహల్య, రెగ్యులర్‌ ఏఎనఎం, దేవనకొండ, పీహెచసీ, కర్నూలు జిల్లా  

క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఏఎనఎంలను యథాస్థానంలో కొనసాగించాలి. ఫ్యామిలీ పిజీషియన పేరుతో రెగ్యులర్‌ ఏఎనఎంలను సచివాలయాల్లో ఖాళీగా ఉన్న చోటకు వేస్తామంటే ఎలా..? పిల్లల చదువులు ఏం కావాలి. సబ్‌ సెంటర్లలో పని చేస్తున్న ఏఎనఎంలందరికీ 50 సంవత్సరాలు దాటాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ తక్షణమే కౌన్సెలింగ్‌ను విరమించాలి. విద్యా సంవత్సరం మధ్యలో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం సమంజసం కాదు.

27 సంవత్సరాలుగా పని చేస్తున్నా

- బి.మురళి, రెగ్యులర్‌ ఏఎనఎం, ఉలిందకొండ, పీహెచసీ  

గత 27 ఏళ్లుగా జిల్లాలో రెగ్యులర్‌ ఏఎనఎంగా పని చేస్తున్నాను. 26 సంవత్సరాలుగా బయటి పీహెచసీల్లో పని చేసి రెండేళ్ల క్రితమే ఉలిందకొండ పీహెచసీకి వచ్చాను. ఇప్పుడు సర్దుబాటు పేరుతో ఉన్న ఫలంగా మారుమూల ప్రాంతాలకు వేస్తే ఎలా?. జీరో కౌన్సెలింగ్‌ను నిర్వహించి సబ్‌ సెంటర్లలో పని చేసే ఏఎనఎంలకు న్యాయం చేయాలి. సినీయారిటీ ప్రాతిపదికన సర్దుబాటు చేయాలి.

ఏఎనఎంల సర్దుబాటుకు వ్యతిరేకం

- డి.ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌, ఏపీఎనజీవో  

గత 25 సంవత్సరాలుగా పీహెచసీల్లో పని చేస్తున్నా. బదిలీల నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 25 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి పని చేసిన ఏఎనఎంలను మారుమూల ప్రాంతాలకు వేస్తే ఎలా.? ఖాళీలన్నీ ఆదోని డివిజనలో ఉన్నాయి. 50 సంవత్సరాలు పైబడిన ఏఎనఎంలను డిప్యుటేషనపై పంపాలన్న నిర్ణయం సరికాదు. 


 


Updated Date - 2022-08-07T04:48:27+05:30 IST