అధికారులతో సమీక్షిస్తున్న డీఎల్‌పీఓ రామకిష్ణ్రయ్య
గోపవరం, జనవరి 21: మండలంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని డీఎల్‌పీఓ రామక్రిష్ణయ్య పేర్కొన్నారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ 14వ ప్రణాళిక సంఘం నిధులతో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు గుర్తించి వాటిని ప్రణాళికబద్దంగా పూర్తి చేయాలని సూచించారు.
సచివాలయాల్లో ఉన్న సమస్య లు గుర్తించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకుని ప్రజలకు మెరుగైన సేవలందించేలా చర్యలు చేపట్టాలన్నా రు. ముఖ్యంగా వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్ప టి నుంచే దృష్టి సారించాలని కార్యదర్శులకు సూచించారు. ఇనఛార్జ్ ఎంపీడీఓ భానుప్రసాద్, ఈఓపీఆర్‌డీ విజయకుమార్, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసులరెడ్డి, మోసే, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.