గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2021-06-20T05:54:59+05:30 IST

గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ పేర్కొన్నారు.

గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

- కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 19 : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం పల్లెప్రగతి హరితహారం, పారిశుధ్యంపై సంబం ధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని ఎప్పటిక ప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. కాలువల శుద్ధి చేపట్టాలన్నారు. రెండు నెలలకొక సారి గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని కార్యల యాల పరిశుభ్రత స్థానిక సంస్థ లేదని స్పష్టం చేశారు. మొక్కలు నాటాడానికి గుంత ల తవ్వాకాలు మొదలుపెట్టా లని సూచించారు. మెగా పల్లెప్రకృతి వనాల ఏర్పాటు కు మండలంలో 10 ఎకరాల స్థలం గుర్తించాలన్నారు. అలాగే నర్సరీ ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం చూడాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, పలువురు మండల ప్రత్యేక అధికారు, ఎంపీడీవో లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:54:59+05:30 IST