ప్రత్యేక స్పందనలో వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2022-05-17T06:17:48+05:30 IST

ప్రత్యేక స్పందనలో వచ్చిన అర్జీలపై శ్రద్ధపెట్టి పరిష్కరించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఈనెల 13న మార్కాపురంలో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీల ప్రత్యేక స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలతో పాటు, పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు, స్థానిక స్పందన హాలులో సోమవారం పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు

ప్రత్యేక స్పందనలో వచ్చిన అర్జీలపై దృష్టి పెట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 16 : ప్రత్యేక స్పందనలో వచ్చిన అర్జీలపై శ్రద్ధపెట్టి పరిష్కరించాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఈనెల 13న మార్కాపురంలో నిర్వహించిన ఎస్సీ,ఎస్టీల ప్రత్యేక స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలతో పాటు, పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు, స్థానిక స్పందన హాలులో సోమవారం పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 80 శాతం అర్జీలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించే విధంగా చూడాలని దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. తద్వారా జిల్లా కేంద్రంలో నిర్వహించే స్పందనకు ఒత్తిడి తగ్గుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమన్నారు. కింది స్థాయిలో పరిష్కరిస్తున్న అర్జీలను యాధృచ్ఛికంగా ఐదింటిని ఎంపిక చేసి వాటిని పరిష్కరించిన తీరును సంబంధిత అధికారులు పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈసమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, డీఆర్వో పులి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-05-17T06:17:48+05:30 IST