కోస్తాలో పొగమంచు

ABN , First Publish Date - 2021-01-25T08:47:12+05:30 IST

సముద్రం నుంచి కోస్తాపైకి తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో ఆదివారం కోస్తాలో అనేకచోట్ల పొగమంచు కురిసింది.

కోస్తాలో పొగమంచు

విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సముద్రం నుంచి కోస్తాపైకి తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో ఆదివారం కోస్తాలో అనేకచోట్ల పొగమంచు కురిసింది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురియడంతో ఉదయం పూట రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. అయితే ఆకాశం నిర్మలంగా ఉండడంతో ఉదయం పదిగంటల నుంచే ఎండ తీవ్రత కొనసాగింది. దీంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కాగా సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడడంతో రాయలసీమ, కోస్తా శివారు ప్రాంతాల్లో చలి పెరిగింది. ఆదివారం నందిగామలో 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, అనంతపురంలో 15.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

Updated Date - 2021-01-25T08:47:12+05:30 IST