Viral Video: ఈ స్కూటర్‌ని చూశారా.. మడతపెట్టి బ్యాగులో ఎక్కడికైనా తీసుకెళ్లచ్చు

ABN , First Publish Date - 2021-12-29T09:50:33+05:30 IST

టెక్నాలజీతో నిత్యం కొత్త ఆవిష్కరణలతో ఆకట్టుకునే జపాన్.. ఇటీవల పోయిమో అనే ఒక ఇన్‌ఫ్లేటబుల్ స్కూటర్‌ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని మడతపెట్టేసి బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు...

Viral Video: ఈ స్కూటర్‌ని చూశారా.. మడతపెట్టి బ్యాగులో ఎక్కడికైనా తీసుకెళ్లచ్చు

టెక్నాలజీతో నిత్యం కొత్త ఆవిష్కరణలతో ఆకట్టుకునే జపాన్.. ఇటీవల పోయిమో అనే ఒక ఇన్‌ఫ్లేటబుల్ స్కూటర్‌ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని మడతపెట్టేసి బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. అలాగే మీకు ఇష్టమైన డిజైన్‌లో దీనిని ఆర్డర్ చేయవచ్చు. జ‌పాన్ కు చెందిన టొక్యో విశ్వవిద్యాల‌యం శాస్త్ర‌వేత్త‌లు దీనిని రూపొందించారు. 


పోయిమో ఇన్‌ఫ్లేటబుల్ స్కూటర్‌ థెర్మోప్లాస్టిక్ ర‌బ్బ‌ర్‌తో తయారుచేయబడింది. దీంతో బైక్ 5.5 కేజీల బ‌రువుతో తేలికగా ఉంటుంది. థెర్మోప్లాస్టిక్ ర‌బ్బ‌ర్‌ కావడం వల్ల దీన్ని మడ‌త‌పెట్టేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒక గాలిమిష‌న్‌తో గాలికొడితే రెండు నిమిషాల్లో బైక్ బాడీలోకి గాలి వెళ్లి స్కూటర్ రెడీ అయిపోతుంది. సాధారణంగా బైకులకు రెండే చక్రాలుంటాయి. కానీ ఈ స్కూటర్ కు నాలుగు చక్రాలుంటాయి.

 



ఈ బైక్‌లో మోటార్ క‌మ్ బ్యాట‌రీ ఉంటుంది. ఈ బైక్ కంట్రోల్స్ అన్ని బైక్ హ్యాండిల్ దగ్గరే ఉంటాయి. ఈ బైక్ లో ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయండోయ్..మన అవసరాలను బట్టి బైక్‌ను డిజైన్ల‌లో మార్పులు చేసుకోవ‌చ్చు. ఈ పోయిమో బైక్ బ్యాట‌రీని ఒక‌సారి చార్జ్ చేస్తే గంట‌కు 15 కిమీ వేగంతో 90 నిమిషాల‌పాటు ప్ర‌యాణిచొచ్చు. గ‌రిష్టంగా 20 కిమీ వ‌ర‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. 

Updated Date - 2021-12-29T09:50:33+05:30 IST